Site icon HashtagU Telugu

Onion: మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధాడుతున్నారా.. అయితే ఉల్లిపాయను అస్సలు తినకండి.. తిన్నారో!

Onion

Onion

ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది ఉల్లిపాయను వంటల్లో తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉల్లిపాయతో చేసే వంటలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత ఉంది. ఉల్లిపాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుందట. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని చెబుతున్నారు.

అంతేకాకుండా ఉల్లిపాయను జట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన ఉల్లిపాయను కొంతమంది మాత్రం తినకూడదు అని చెబుతున్నారు. మరి ఎవరెవరు ఉల్లిపాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఉల్లిపాయల్ని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఉల్లిపాయలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి అనేక అంశాలు ఉంటాయట. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుందని,ఇప్పటికే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు తింటే మీ పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. మలబద్ధకంతో బాధపడేవారు కూడా ఉల్లిపాయ ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ​డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఉల్లిపాయ తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లిపాయలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందట.

ఇది మీ ఆరోగ్యానికి హానికరం కాదు. కాబట్టి షుగర్ రోగులు ఉల్లిపాయలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలట. ఒకవేళ మీరు ఉల్లిపాయ ఎక్కువగా తినాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలట. ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు హానికరం కావచ్చని, అది గుండెల్లో మంటను కలిగిస్తుందని, అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఉల్లిపాయల్ని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. పాలిచ్చే తల్లులు కూడా ఉల్లిపాయలు తినే విషయంలో అలర్ట్‌గా ఉండాలట. ఎక్కువగా తింటే బిడ్డ జీర్ణక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల్లో కడుపునొప్పి వచ్చే అవకాశం ఉందట. ఉల్లిపాయలు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదించేలా చేస్తాయి. ఇప్పటికే రక్తస్రావం లోపాలతో బాధపడేవారు ఉల్లిపాయల్ని తినకూడదు. అంతేకాకుండా రక్త గడ్డకట్టడంలో ఇబ్బందులు పడేవారు మందులు తీసుకుంటుంటారు. ఇలాంటి వారు కూడా ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మెడిసిన్‌తో రియాక్షన్ జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.