Cucumber: కీర దోసకాయను ఆ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదట!

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కీర దోసకాయలు మనకు మార్కెట్లో వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 04:12 PM IST

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కీర దోసకాయలు మనకు మార్కెట్లో వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కీర దోసకాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఇతర సీజన్లతో పోల్చుకుంటే కీరా వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది.

చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా కీర దోసకాయ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కీర దోసకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నావారు కీరాను అసలు తినకూడదట. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కీర దోసకాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూరిన్ సమస్యలు ఉన్నవారు కీరదోస అస్సలు తినకూడదట. ముఖ్యంగా ఎక్కువ యూరిన్ వెళ్లేవారు ఈ కీరదోసకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. యూరిన్ సమస్యలు ఉన్నవారు కీర దోసకాయ తింటే అనేక రకాల సమస్యలు వస్తాయట. అలాగే ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుందో వారు కూడా కీర దోసకాయ తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఒకవేళ ఎసిడిటీ ఉన్న వారు తింటే ఆ ప్రాబ్లం మరింత ఎక్కువ అవుతుందట.

కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కీర దోసకాయను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. కీరదోసలో కూలింగ్ ఫ్యాక్టర్లు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి జలుబు, దగ్గు లాంటి సమస్య ఉన్నవారు కీరదోస తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు ఉన్నవారు కీర దోసకాయను తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుందట. అలాగే స్కిన్ ఎలర్జీ ఉన్నవారు ఫుడ్ అలర్జీ ఉన్నవారు దోసకాయను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉన్నవారు తెలియక తిన్నా కూడా ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందట. కీరదోసకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ చలికాలం వర్షాకాలం మాత్రం కీరదోసని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు వైద్యులు. అలాగే కీరదోస ను రాత్రిపూట అస్సలు తినకూడదట. ఎందుకంటే.. రాత్రిపూట తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒక్కోసారి అసలు వచ్చిన నిద్రకూడా పోయే అవకాశం ఉంటుందట. అలాగే రాత్రిపూట తినడం వల్ల జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

Follow us