మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మొక్కజొన్న తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు మొక్కజొన్న ఉడకబెట్టుకుని తింటే మరికొందరు కాల్చుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా మొక్కజొన్న మనకు లభిస్తూ ఉంటాయి. చల్లటి వాతావరణం లో వేడివేడి మొక్కజొన్నను ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. మొక్కజొన్న తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో విటమిన్ ఇ, బి6, బి1, లినోలిక్ ఆసిడ్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్, నియాసిన్ వంటి పోషకాలు ఉన్నాయి.
ఈ పోషకాల వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో, రోగాల్ని తట్టుకునే శక్తి వస్తుంది. మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా మొక్కజొన్నను కొంతమంది తినకూడదట. మరి మొక్కజొన్నను ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కొందరు చర్మ సమస్యలు, అలెర్జీతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు మొక్కజొన్న ఎక్కువగా తినకూడదట. తింటే ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనిలో ఉండే ప్రోటీన్ చర్మ సమస్యలు మరింత పెంచుతుందట. చర్మంపై దద్దుర్లు, మంట, వాపు వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. మొక్కజొన్నలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంటే చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీంతో షుగర్ ఉన్నవారు మొక్కజొన్న ఎక్కువ మోతాదులో తినకూడుదు..
ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. తక్కువగా తింటే ఏ సమస్య రాకపోవచ్చు. అలాగే చాలా మంది అజీర్తి, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలతో తరుచుగా బాధపడుతుంటారు. ఇలాంటి వారు మొక్కజొన్నను ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో ఇంజెస్టబుల్ ప్రోటీన్ ఉంది. ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మితంగా తింటే ఏం కాదు. ఎక్కువగా తింటేనే ప్రమాదం. అందుకే జీర్ణసమస్యలు ఉన్నవారు మొక్కజొన్న ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గాలి అనుకుంటున్నారు మొక్కజొన్నకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్న వారు మొక్కజొన్న పొత్తుల్ని ఎక్కువగా తినకూడదు. ఇందులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువగా తింటే చక్కెరను బర్న్ చేయడం కష్టం. దీంతో చక్కెర కొవ్వుగా మారే ప్రమాదముంది. దీంతో బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు మొక్కజొన్నను ఎక్కువగా తినకూడుదు.