మన వంటింట్లో దొరికే కూరగాయలలో ఒకటైన కాకరకాయ గురించి మనందరికీ తెలిసిందే. ఈ కాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ కలిగే ప్రయోజనాలు మాత్రం అమోఘం అని చెప్పాలి. కాకరకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కొంతమంది కాకరకాయను ఇష్టంగా తింటే మరికొందరు అంతగా ఇష్టపడరు. అయితే కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కాకరకాయను అస్సలు తినకూడదని చెబుతున్నారు..
మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు కాకరకాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తక్కువగా ఉన్నవారు ఎట్టిపరిస్థితిలో కాకరకాయను తినకూడదట. ఎందుకంటే కాకరకాయని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత తగ్గుతాయట. అందుకే షుగర్ తక్కువ ఉన్నవారు కాకరకాయ తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాకరకాయను అస్సలు తినకూడదట. ఎందుకంటే ఇది పుట్టబోయే పిల్లలకు హాని కలిగిస్తుందట. కాకరకాయ జ్యూస్ ను తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.
కానీ కాలెయానికి సంబంధించిన వ్యాధులు ఉంటే మాత్రం కాకరకాయను అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది కాలేయంలో ఫ్రోటీన్ ప్రసరణను ఆపివేస్తుందట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుందట. అలాగని దీన్ని మోతాదుకు మించి అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తింటే మీకు ఎన్నో సమస్యలు వస్తాయట. వీటిలో డయేరియా కూడా ఒకటి అని చెప్తున్నారు. కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వంటి సమస్యలు వస్తాయట. ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే కాకరకాయను పొరపాటున కూడా తినకూడదని చెబుతున్నారు. కాకరకాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయట. అందుకే కాకరకాయను రెగ్యులర్ గా తిన్న లిమిట్ లో తీసుకోవాలని లేదంటే పొత్తికడుపు నొప్పి వస్తుందని చెబుతున్నారు. జ్వరం తలనొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా కాకరకాయను అస్సలు తినకూడదట.