సాధారణంగా రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటూ ఉంటారు. యాపిల్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పండలో ఎక్కువగా శాతం మంది ఉపయోగిస్తున్న వాటిలో మొదటిది అరటిపండు కాగా రెండవది యాపిల్. అయితే నిజానికి యాపిల్ రోగ నిరోధక శక్తిని పెంచే పండు అయిన ఆయుర్వేదం ప్రకారం ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోకూడదట. అలాగే ఒకే రకమైన ఆహారాలు కానీ ఒకే రకమైన ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట.
ఇది కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలను పొందడానికి రోజులో ఒక ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వాటిని తినాలట. యాపిల్ లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుని చేకూరుస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల్ని తగ్గించడంతోపాటు బలాన్ని కూడా ఇస్తాయి. యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది అభిప్రాయపడటంతో పాటు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినే వారు కూడా ఉన్నారు. ఒక యాపిల్ పండులో
ఉండే ఫ్లవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ వంటివి ఉంటాయి.
అయితే ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రతిరోజు యాపిల్ కాయ తినడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని కలిగే అవకాశాలు ఉన్నాయట. షుగర్ పేషెంట్లు రాత్రి లేదా సాయంత్రం యాపిల్ తింటే పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రేగుల పనితీరుపై భారం పెరుగుతుంది. అంతేకాకుండా రాత్రి పూట యాపిల్ తినటం వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుంది. మరి ముఖ్యంగా తెల్లవారుజామున సమయంలో కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. యాపిల్ తో తయారు చేసిన పదార్థాలు బరువు పెంచడంతోపాటు, టైప్ 2డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఒక మీడియం సైజ్ యాపిల్ కాయలో 90 క్యాలరీలు ఉంటాయి.