చెరుకు రసం.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో చెరుకు రసంని ఎక్కువగా తాగుతూ ఉంటారు. వేసవి కాలంతో పాటు ఇతర సీజన్లలో కూడా కొంతమంది తాగుతూ ఉంటారు. చెరుకు రసంలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేసవిలో శరీరాన్ని హైటేటెడ్ గా ఉంచడంలో చెరుకు రసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ జ్యూస్ ని అందరూ తాగవచ్చు కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తాగకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాలకపోవడమే మంచిదట. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ ఉన్నవారి శరీరంలోని రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుందట. అలాగే ఇందులో సహజ చక్కెర సుక్రోజ్ అధిక మొత్తంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగితే, వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. స్తూలకాయ సమస్యతో బాధపడుతున్న వారు అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు ఈ చెరుకు రసం తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు.
చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. జలుబు చేసిన వారు కూడా ఈ చెరుకు రసం నీ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ జలుబు ఉన్నా కూడా అలాగే తాగాలి అనుకుంటే గొంతు నొప్పి రావడంతో పాటు జలుబు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు చెరుకు రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందట.