కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇందులో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. కొబ్బరి నీళ్లు ఎన్నో రకాల సమస్యలను దూరం చేయడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అని చెబుతున్నారు. కొబ్బరినీటిలో విటమిన్లు, ఖనిజాలు,ఎలక్ట్రోలైట్స్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ విషయాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఎంతో బాగా సహాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక అని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి.
ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన కొబ్బరి నీళ్ళు కొందరు మాత్రం తాగకూడదట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మరి కొబ్బరి నీటిని ఎవరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నీళ్లలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కొబ్బరి కాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరమే అయినప్పటికి మూత్ర పిండాల సమస్య లతో బాధ పడేవారికి ఇది చాలా హానికరం అని చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరట. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెబుతున్నారు.
అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందట. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ రక్తపోటు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోకూడదట. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుందట. దాంతో తలతిరగడం, అలసట, మూర్ఛ వంటి సమస్యలకు దారితీస్తుందని, అందుకే లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. ఇది కొబ్బరి నీళ్ల రుచికి తీపిని అందిస్తుందట. అయితే ఈ చక్కెర డయాబెటిక్ రోగులకు మంచిది కాదట. వారికి మరిన్ని సమస్యలను కలిగిస్తుందట. మధుమేహ రోగులు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చని చెబుతున్నారు. అందుకే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.