డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంపప్పును తరుచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బాదంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. బాదం పప్పులో ఉండే ఎల్ కార్నిటైన్, న్యూట్రియంట్లు మెదుడును చురుగ్గా ఉంచుతాయట. బాదంని ఎన్నో రకాల స్వీట్లు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ మంది తినే వాటిలో బాదంపప్పు కూడా ఒకటి.
బాదం పప్పును నానబెట్టి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ బాదం పప్పును కొందరు తినకూడదట. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు బాదంపప్పు తినకూడదో,తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హై బీపీ సమస్యతో బాధపడుతున్న వారు బాదంపప్పు తినకపోవడమే మంచిది. ఎందుకంటే బాదంపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం బీపీ లెవెల్స్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్దబడు సమస్యతో బాధపడేవారు, మెడిసిన్స్ తీసుకుంటున్న వారు బాదంపప్పు జోలికి పోకుండా ఉండడమే మంచిది.
అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు కూడా బాదం పప్పు ఎక్కువగా తినకూడదట. ఇందులో ఉండే ఆక్సలైట్ స్థాయిలో పెరిగితే కిడ్నీలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయట. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు బాదంపప్పుకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అజీర్తి కడుపునొప్పి కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు బాదం పప్పులు ఎక్కువగా తినకూడదట. ఒకవేళ తినాలి అనుకున్నా ఒకటి రెండు తినడం మంచిది అని చెబుతున్నారు. అంతకుమించి ఎక్కువగా తింటే కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందట. అదేవిధంగా అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు బాదం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులో కేలరీలు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా బర్న్ కావు. దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ సమస్యలతో పాటుగా మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా బాదంపప్పు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.