Ghee and Health: ఈ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యి అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

హిందువులు ఎంతో పరమపవిత్రంగా భావించే నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం

  • Written By:
  • Updated On - August 19, 2022 / 06:58 PM IST

హిందువులు ఎంతో పరమపవిత్రంగా భావించే నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నెయ్యినీ పూజలో ఉపయోగించడంతోపాటుగా తినడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుళ్లకు నైవేద్యంగా పెట్టడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నిపుణులు కూడా ఆయుర్వేదంలో పలు రకాల మందులకు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు నెయ్యిని తీసుకోకూడదట. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు నెయ్యిని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని నెయ్యి ని తినడమే మానేశారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజులో రెండు చెంచాలకు మించి నెయ్యిని తినకూడదట. మోతాదుకు మించి ఎటువంటి ఆహారాన్ని తిన్నా కూడా తప్పకుండా కొత్త సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎటువంటి ఆహారాన్ని అయినా కూడా ఈ విధంగా తీసుకోవడం వల్ల ఆహార పదార్థాల ఫలితాలు పొందే వీలు ఉంటుంది. ప్రతిరోజు ఆవు నెయ్యి వాడటం వల్ల శరీరంలో ఉన్న ఉష్ణాన్ని సమంగా రగిలించి ఆయుర్దాయాన్ని అద్భుతంగా కాపాడుతుంది. ఆవు పాలలో,ఆవు నెయ్యి లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మిగిలిన నెయ్యిలో విటమిన్ ఏ ఉండదు. అందుకే అవి పసుపుపచ్చ రంగులో కూడా ఉండవు.

అందుకే ఆవు నెయ్యి చాలా ఉత్తమమైనది అని చెబుతూ ఉంటారు. ఇక ఎటువంటి వ్యక్తులు నెయ్యిని తినకూడదు అన్న విషయానికి వస్తే.. నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలా అని జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు నెయ్యిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా నెయ్యి ని తినకూడదు. జలుబు,దగ్గు,జ్వరంతో బాధపడుతున్న వారు నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. కానీ గర్భిణీ స్త్రీలు కడుపునొప్పి,దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ నెయ్యిని అసలు తీసుకోకూడదు. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా నెయ్యిని అస్సలు తీసుకోకూడదు. నెయ్యి లో ఉండే విటమిన్ ఈ శరీరంలో యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది. నెయ్యి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.