Site icon HashtagU Telugu

Non Veg: మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే నాన్ వెజ్ తినకపోవడమే మంచిది.. తిన్నారో?

Non Veg

Non Veg

నాన్ వెజ్ తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తినడం అసలు మంచిది కాదు. కొంతమందికి వారం వజ్రం అని ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. చేపలు చికెన్ మటన్ వంటివి తింటూనే ఉంటారు. అయితే ఏదైనా సరే శృతిమించితే తప్ప అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కూడా శృతిమించితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు నాన్ వెజ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు నాన్ వెజ్ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గర్బిణీ స్త్రీలు.. ప్రెగ్నెంట్గా ఉన్న మట్టిలో నాన్ వెజ్ తినకూడదట. ఎందుకంటే అందులో ఉండే బ్యాక్టీరియా వైరస్ లు కడుపులో ఉండే బిడ్డకు హాని కలిగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నాన్ వెజ్ లో అధిక మొత్తంలో కొవ్వు కొలెస్ట్రాల్ ఉంటాయట. ఇది గర్భిణీ స్త్రీలకు అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అలాగే నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల వేడి చేసే ప్రమాదం ఉంటుందట.

గుండె సమస్యలు ఉన్నవారు కూడా మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. ఎందుకు అంటే ఇందులో అధిక మొత్తంలో కొవ్వు కొలెస్ట్రాల్ ఉంటాయట. ఇవి గుండెకు హాని కలిగిస్తాయని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా నాన్ వెజ్ లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుందట. వైద్యులు కూడా గుండె సమస్యలు ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

మధుమేహం ఉన్నవారు కూడా నాన్ వెజ్ ఎక్కువగా తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా నాన్ వెజ్ లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుందట. నాన్ వెజ్ తిన్న తర్వాత డయాబెటిక్ రోగులను చక్కర స్థాయి చాలా వేగంగా పెరుగుతుందని ఇది కొన్నిసార్లు ప్రాణాల మీదకు రావచ్చు అని చెబుతున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు నాన్ వెజ్ తినకూడదట. నాన్ వెజ్ తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుందట. దీంతో, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తీవ్రమవుతాయని,ఎందుకంటే నాన్ వెజ్‌ లో అధిక మొత్తంలో సోడియం ఉంటుందని ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుందని చెబుతున్నారు.