Site icon HashtagU Telugu

Lady Finger: మీరు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే బెండకాయని అసలు తినకండి!

Lady Finger

Lady Finger

మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు బెండకాయను తెగ ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక బెండకాయతో మనం ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూనే ఉంటాం. ఈ బెండకాయలు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో విరివిగా లభిస్తూ ఉంటాయి. అయితే బెండకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు బెండకాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు బెండకాయను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలెర్జీలు ఉన్నవారు కొన్ని రకాలా ఆహారాలను అస్సలు తినకూడదు. అందులో బెండకాయ అలెర్జీ ఉన్నవారు బెండకాయ తినకపోవడమే మంచిది. ఒకవేళ తింటే చర్మ అలెర్జీలు లేదా జీర్ణశయాంతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు ఏవి పడితే అవి తినకూడదట. ఎందుకంటే కొన్ని ఆహారాలు కిడ్నీ స్టోన్ సమస్యలను మరింత పెంచుతాయని చెబుతున్నారు. అలాగే బెండకాయను కూడా మూత్రపిండాల్లో రాళ్లున్న వారు అస్సలు తినకూడదట. అలాగే కిడ్నీకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాంటి వారు బెండకాయ కూరను తింటే జీర్ణ కోశ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తరచుగా గ్యాస్, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరంతో బాధపడున్నారు. ఇలాంటి వారు బెండకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు బెండకాయను తింటే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే
డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయను తినకుండా ఉండాలి. నిజానికి బెండకాయ మధుమేహులకు మంచిదే. కానీ దీన్ని మరీ ఎక్కువగా తినకుండా ఉండాలని చెబుతున్నారు. మరీ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. కొంతమంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే బెండకాయ కడుపు నొప్పిని మరింత పెంచుతుందట.

Exit mobile version