Site icon HashtagU Telugu

Cashew Nuts: ఆ సమస్యలతో బాధపడుతున్న వారి జీడిపప్పు తింటే ఇక అంతే సంగతులు?

Mixcollage 02 Jan 2024 08 01 Pm 2814

Mixcollage 02 Jan 2024 08 01 Pm 2814

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పు గురించి మనందరికీ తెలిసిందే. జీడిపప్పు వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పును అనేక రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు నేరుగా తింటే మరికొందరు స్వీట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే జీడిపప్పు ఆరోగ్యానికి మంచిదే అని ఎక్కువగా తినడం కూడా ఏమాత్రం మంచిది కాదు. అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కూడా జీడిపప్పును అస్సలు తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు జీడిపప్పును తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అలర్జీ ఉన్నవారు కూడా జీడిపప్పులు తినడం అంత మంచిది కాదు. కొంతమందికి నట్స్ తినడం మంచిది కాదు. కాబట్టి జీడిపప్పులు తినే ముందు ఆలోచించాలి. ఈ జీడిపప్పులు అలర్జీలను పెంచే గుణం ఉంటుంది. కాబట్టి అలర్జీ సమస్య ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. జీడిపప్పుల్లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల అధికబరువు పెరుగుతారు. ముఖ్యంగా, ఫ్రై చేసినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే, వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. అధిక బరువు సమస్యతో బాధపడే వారిని వీటిని తినడం వల్ల బరువు ఇంకా పెరుగుతారు.

జీడిపప్పులు తింటే ఆక్సలేట్స్‌ని ఏర్పడుతుంది. ఇది రాళ్ళు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి, వీటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని చేసుకునే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినకూడదు. ఇందులో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలకు మంచిది కాదు. అందుకే, ఈ జీడిపప్పులు తినకపోవడం మంచిది.