Site icon HashtagU Telugu

Monkeypox : వామ్మో మంకీపాక్స్ కు కారణం అదా..? బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ!!

Monkey Pox

Monkey Pox

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఏంటో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOవెల్లడించింది. శృంగారం కారణంగానే అది వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని..చెప్పడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలులేవని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మంకీపాక్స్ వైరస్ సోకినవారు ఇతరులకు దూరంగా ఉండాలని వైద్యులను సంప్రదించి చికిత్సతీసుకోవాలని సూచించారు.

ఈ వైరస్ చికిత్స కోసం యాంటీ వైరల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఇవి అంతంతమాత్రంగానే ఉన్నా వైరస్ వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఈ వైరస్ నివారణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు.ఇప్పటి వరకు 29 దేశాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గతంలోమంకీ పాక్స్ లేని దేశాల్లోనూ ఇప్పుడుకేసులు వెలుగు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఇప్పటి వరకు 66 మంది మరణించినట్లు టెడ్రోస్ వివరించారు.

Exit mobile version