Men Or Women: పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో తెలుసా?

ఒక పరిశోధన ప్రకారం.. సుమారు 20,800 మందిపై 23 దేశాల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే మహిళలతో పోలిస్తే పురుషులు మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Men Or Women

Men Or Women

Men Or Women: మాంసాహారం ప్రియులకు మాంసం తినడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్నేహితులతో పార్టీ అయినా, వివాహ కార్యక్రమం అయినా లేదా మామూలుగా పార్టీ చేసుకోవాల‌నుకున్న వెంటనే మాంసం వండుకుంటారు. అయితే ఇటీవల వచ్చిన ఒక పరిశోధన దీనిపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఉదాహరణకు మహిళలు, పురుషులలో ఎవరు ఎక్కువగా మాంసం తింటారు? ఇలాంటి ప్రశ్న అడిగితే మీరు కూడా గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే ఎవరు తక్కువ తింటున్నారు? ఎవరు ఎక్కువ తింటున్నారనే దానిపై మనం అంతగా దృష్టి పెట్టం. అయితే పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు ఎక్కువ మాంసం తింటారు?

ఒక పరిశోధన ప్రకారం.. సుమారు 20,800 మందిపై 23 దేశాల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే మహిళలతో పోలిస్తే పురుషులు మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన, లింగ సమానత్వం ఉన్న దేశాలలో ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అంటే పురుషులకు, మహిళలకు సమాన హోదా, ఆర్థిక స్వేచ్ఛ ఉన్న చోట్ల పురుషులు మహిళల కంటే ఎక్కువ మాంసం తింటున్నట్లు కనుగొనబడింది.

Also Read: Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

పబ్‌మెడ్ (PubMed) లో ప్రచురించబడిన మరొక అధ్యయనం కూడా ఇదే నిర్ధారణకు వచ్చింది. ఆ అధ్యయనంలో నమోదు చేసిన డేటా ప్రకారం, పురుషులలో రెడ్ మీట్ మరియు ప్రాసెస్డ్ మీట్ వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ తేడా ఇంత స్పష్టంగా ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిని ‘స్ట్రాంగ్ జెండర్ డిఫరెన్స్’ (బలమైన లింగ భేదం) గా అభివర్ణించారు.

పురుషులు ఎందుకు ఎక్కువగా మాంసం తింటారు?

మహిళల కంటే పురుషులు ఎక్కువగా మాంసం తింటారని మనకు తెలిసిన తర్వాత దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. చాలా చోట్ల, పురుషులు మాంసం ఎక్కువగా తినడం వారి పురుషత్వాన్ని నిరూపించుకోవడానికి సంకేతంగా భావిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో పురుషులకు ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మహిళల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే వారు మహిళల కంటే మాంసాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు.

అధ్యయనంలో తేలిన మరో విషయం ఏమిటంటే.. వయసు పెరిగే కొద్దీ మాంసం వినియోగం తగ్గుతుంది. కానీ యువకులు, మధ్య వయస్సు పురుషులలో దీని స్థాయి మహిళల కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రతి దేశంలోనూ ఒకే విధమైన గణాంకాలు కనిపించవు. చైనా, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో పురుషులు- మహిళల మాంసం వినియోగంలో వ్యత్యాసం చాలా తక్కువగా లేదా దాదాపుగా లేనట్లు కనుగొనబడింది.

  Last Updated: 22 Oct 2025, 06:23 PM IST