Site icon HashtagU Telugu

Tomato: ఈ సమస్యలు ఉన్నవారు టమోటాలు తింటే ఇక అంతే సంగతులు.. జాగ్రత్త!

Tomato

Tomato

మామూలుగా టమోటా లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. చాలా రకాల వంటల్లో టమోటాలను ఉపయోగిస్తూ ఉంటారు. టమోటా ను ఉపయోగించి ప్రత్యేకంగా కొన్ని వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. టమోటా ను కొందరు కూరల రూపంలో తీసుకుంటే మరికొందరు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. టమోటా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టమోటాలు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సీ, యాంటీ యాక్సిడెంట్లు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే టమోటాలు ఆరోగ్యానికి మంచి చేసినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు టమోటాలు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్య కాలంలో చాలా మందిని బాధించే అతిపెద్ద సమస్య కిడ్నీలో రాళ్లు ఉండడం. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. టమోటాల్లో కాల్షియం ఆక్సలేట్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తుందట. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు టమోటాలను తినకూడదని, తింటే కొన్ని కొన్ని సార్లు మూత్ర పిండాలు కూడా దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు. కీళ్ల వాపు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వ్యక్తులు టమోటాల జోలికి ఎంత తక్కువగా పోతే అంత మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే టమోటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.

ఇది మన కణాల్లో క్యాల్షియం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. క్యాల్షియం ఎక్కువైతే కీళ్ల వాపు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కొన్నిసార్లు నడవడం, కూర్చోవడం, కదలడం కూడా ఇబ్బందిగా మారుతుందట. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వారు టమాటాలు తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే టమోటాలలో హిస్టామిన్ అనే పదార్ధం ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయట. అందుకే ఇప్పటికే అలర్జీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, ముఖం, నోటి వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. గ్యాస్ సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు టొమాటోలు తక్కువగా తినాలని చెబుతున్నారు. టమోటాల్లో ఆమ్ల పదార్ధం ఎక్కువగా ఉంటుంది.

దీనిని అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుందట. దీంతో గ్యాస్ సమస్య ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే గుండెలో మంట, కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు కూడా వస్తాయట. అందుకే గ్యాస్ సమస్యలు ఉన్న వ్యక్తులు టమోటాలను తక్కువగా తినాలట. సాధారణంగా ఎప్పుడైనా దెబ్బ తగిలేటప్పుడు రక్తం తొందరగా గడ్డ కట్టి, రక్తస్రావం కాకుండా ఉంటే చాలా మంచిది. కానీ టమోటాలను ఎక్కువగా తినడం వల్ల రక్తం గడ్డకట్టే స్థాయిని తక్కువగా చేస్తుందట. రక్తం పలుచగా ఉన్న వ్యక్తులు ఈ టమోటాల జోలికి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.