White Rice: ప్రతిరోజు వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీకు ఆ రోగాలు వచ్చినట్లే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది అన్నం లేదా వైట్ రైస్ కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. మూడు పూట్లల్లో కనీసం ఒక్క పూట

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 09:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది అన్నం లేదా వైట్ రైస్ కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. మూడు పూట్లల్లో కనీసం ఒక్క పూట అయినా వైట్ రైస్ ఉండాల్సిందే. అయితే వైట్ రైస్ ను ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని వైద్యులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా వైట్ రైస్ ను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటుగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ ని ఎక్కువగా తినకపోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరుగుతుంది.

వీటితోపాటుగా వైట్ రైస్ ని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. వైట్ రైస్ ని తినడం వల్ల ముఖ్యమైన పోషకాలు ఉండవు. అంతేకాకుండా వైట్ రైస్ ని ఎక్కువ తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మూడు పూటలా వైట్ రైస్ తినే అలవాటు ఉన్నవారు మానుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అలాగే వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి వయసును బట్టి రోజు వారి ఆహారంలో రకరకాల పండ్లతో పాటు కూరగాయలను కూడా తీసుకోవాలి.

మరి ముఖ్యంగా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవాలి. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినవచ్చు. వైట్ రైస్ ని డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా తీసుకోకూడదు. అదేవిధంగా వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కూడా రావచ్చు. కాబట్టి మూడు పూటలా వైట్ రైస్ కు బదులుగా కాకుండా రాగి ముద్ద చపాతి ఉప్మా లాంటి ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.