Site icon HashtagU Telugu

Health Tips: వైట్ బ్రెడ్,బ్రౌన్ బ్రెడ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది తెలుసా?

Mixcollage 30 Jul 2024 10 28 Am 461

Mixcollage 30 Jul 2024 10 28 Am 461

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఫుడ్ లలో బ్రెడ్ కూడా ఒకటి. బ్రెడ్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తింటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ బ్రెడ్ ని ఇష్టపడే తింటూ ఉంటారు. ఆరోగ్యం బాగో లేనప్పుడు వైద్యులు కూడా బ్రెడ్ ని తినమని చెబుతూ ఉంటారు. అయితే మార్కెట్లో మనకు రెండు రకాల బ్రెడ్లు లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి వైట్ బ్రెడ్ రెండవది బ్రౌన్ బ్రెడ్. చాలా వరకు చాలా మంది వైట్ బ్రెడ్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి నిజానికి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రౌన్ బ్రెడ్ ని గోధుమపిండితో తయారు చేస్తూ ఉంటారు. ఇక వైట్ బ్రెడ్ ని మైదాపిండితో తయారు చేస్తూ ఉంటారు. ఇక ఇందులో ఫైబర్ విషయానికి వస్తే బ్రౌన్ రెడ్ లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల బ్రౌన్ బ్రెడ్ లో 4.7 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే 100 గ్రాముల వైట్ బ్రెడ్ లో 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంటే బ్రౌన్ బ్రెడ్ లో సగం అన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయట. అలాగే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తాయి. అందుకే బరువు తగ్గేవారికి, డయాబెటీస్ పేషెంట్లకు బ్రౌన్ బ్రెడ్ మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే వైట్ బ్రెడ్ లో కంటే బ్రౌన్ బ్రెడ్ లో 1.6 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది.

ఎందుకంటే బ్రెడ్ ను బ్రౌన్ చేయడానికి ఉపయోగించే క్యారమెల్ దీనికి అసలు కారణంగా చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ విషయానికి వస్తే.. 100 గ్రాముల బ్రౌన్ బ్రెడ్ లో గ్రాములు, 100 గ్రాముల తెల్ల రొట్టెలో 9 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బ్రౌన్ బ్రెడ్ లోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అలాగే వైట్ బ్రెడ్ లో 77 కేలరీలు, బ్రౌన్ బ్రెడ్ లో 75 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఇవి రెండూ కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం బ్రెడ్ ను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.