Health Alert: మధుమేహం ఉందా.. ఈ కూరగాయలు అస్సలు తినకండి.. నిపుణుల సలహా ఇదే!

మధుమేహం ఉన్నవారు తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 11:00 AM IST

మధుమేహం ఉన్నవారు తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకోసం కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోమని మరి ముఖ్యంగా కూరగాయలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే కూరగాయల్లో కూడా అన్ని రకాలు కూరగాయలను మధుమేహం ఉన్నవారు తినకూడదు. కొన్ని రకాల కూరగాయలు కారణంగా ఇబ్బంది ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు ఎటువంటి కూరగాయలు తీసుకోవాలి? ఎటువంటి కూరగాయలకు దూరంగా ఉండాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉ‍న్న పదార్థాలు తీసుకోవాలట.

అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. దీనివల్ల మందులు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. భూమి లోపల పండే దుంపల వంటి కూరగాయలకంటే ఉపరితలం పైన పెరిగే కూరగాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఉపరితలం పైన పెరిగే అన్నీ కూరగాయలలో కాకుండా కేవలం కొన్నింటిలో మాత్రమే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఎదురు చెబుతున్నారు. ఇకపోతే ఎటువంటి కూరగాయలను తీసుకోవడం మంచిది? అన్న విషయానికి వస్తే.. క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకుల తరహాలో ఉండే కూరగాయలు. పాలకూర, బచ్చలి, కేల్‌ వంటి ఆకుకూరలు, ఆస్ఫరాగస్‌, పచ్చని బీన్స్‌, వంకాయ, క్యాప్సికమ్‌, పుట్టగొడుగులు, బీన్స్‌, ఇతర చిక్కుడు జాతి కూరగాయలు.

టమాటా, ఉల్లిపాయలు, దోసకాయలు అయితే కూరగాయలు ఏవైనా సరే తాజాగా ఉన్నవాటితోనే ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టినవి, నిల్వ చేసిన వాటిలో పోషక విలువలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు. ఏ కూరగాయలకు దూరంగా ఉండాలి అన్న విషయానికొస్తే..ఆలుగడ్డ, చిలగడ దుంపలు, గుమ్మడి పండు, దాని జాతికి చెందిన బట్టర్‌నట్‌ స్వ్క్వాష్‌కర్ర పెండం, కంద, మొక్కజొన్న వెజిటబుల్‌ జ్యూస్‌,టమాటా ప్యూరీ, ప్రాసెస్‌ చేసి, నిల్వ చేసిన అన్నిరకాల కూరగాయలకు దూరంగా ఉండాలి.