Weight Loss: అధికబరువు సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ లు పరగడుపున తాగితే ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని రకాల జ్యూస్ లు తాగడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చట. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరాన్ని శుభ్రపరచడానికీ, జీవక్రియ సక్రమం చేయడానికి ఉదయం ఉత్తమ సమయం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం కొన్ని కూరగాయల జ్యూస్ లు తాగడం ప్రారంభించాలట.
 ఇలా చేయడం వల్ల మీ అధిక బరువు చాలా ఈజీగా, సహజంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది బీట్ రూట్ జ్యూస్. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందట. దీనిలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయని, ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే కనీస వ్యాయామం మాత్రం కచ్చితంగా చేయాలని చెబుతున్నారు. పాలకూర జ్యూస్ లో ఫైబర్ , ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుందట.
ఇది తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుందని, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ లో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని పోషించడమే కాకుండా దానిని నిర్విషీకరణ చేసి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయట. సొరకాయ రసం శరీరాన్ని చల్లబరుస్తుందట. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని, ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల కడుపు శుభ్రమవుతుందట. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. కీరదోస కాయ జ్యూస్ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుందట. పరగడుపున దీనిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. టమాట జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా లైకోపీన్, బరువు నిర్వహణలో సహాయపడతాయని, ఈ జ్యూస్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని,శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు.
Weight Loss: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే పరగడుపున ఈ జ్యూస్ లు తాగాల్సిందే!

Lose Weight
