Site icon HashtagU Telugu

Weight Gain: బరువు పెరగాలనుకుంటున్నారా.. ఈ రోటి తినాల్సిందే?

A Simple Roti Recipe 1

A Simple Roti Recipe 1

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటే ఇంకొంత మంది మాత్రం ఎంత తిన్నా కూడా బరువు పెరగడం లేదని పల్చగా బక్కగా ఉన్నామని తెగ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బరువు పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొందరు ఎంత తిన్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బరువు పెరగరు. బరువు కోరడం కోసం చాలామంది హోమ్ రెమిడిలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు సరైన ఫలితాలు రావు.

అయితే మీరు బరువు పెరగాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పబోయే రోటీలు తినాల్సిందే అంటున్నారు వైద్యులు. మరి ఎలాంటి రోటీలు తింటే బరువు పెరుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాదం పిండిలో విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం, ఒమేగా 3 అసంతృప్త కొవ్వు వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్వినోవా పిండి కూడా మీరు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.

ఇందులో ఫైబర్, ఇనుము, అసంతృప్త కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మీరు వేగంగా బరువు పెరగడానికి సహాయపడతాయి.
అదేవిధంగా బుక్వీట్ పిండి కూడా బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఇనుము, భాస్వరం వంటి పోషకాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా పెరుగుతారు. బియ్యం పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును ఫాస్ట్ గా పెంచుతుంది. మీరు బరువు పెరగడానికి ప్రతిరోజూ బియ్యం పిండి రొట్టెను తినవచ్చు. రాగి పిండి కూడా బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రాగి పిండితో తయారుచేసిన రోటీలు తినడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఓట్స్ తో తయారు చేసిన రొట్టె తినడం వల్ల మీరు ఈజీగా హెల్తీగా బరువు పెరుగుతారు.