Cucumber Side Effects: మన వంటింట్లో దొరికే కాయగూరలలో కీరదోసకాయ కూడా ఒకటి. ఈ కీరదోసని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ కీర దోసకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. దోసకాయలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొన్నిసార్లు హానికరం కూడా కావచ్చట. దోసకాయ నీటితో నిండి ఉంటుంది, కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. నిర్జలీకరణం నుంచి కాపాడుతుంది. ఇది సలాడ్, రైతా లేదా నేరుగా ఉప్పుతో తింటారు.
దోసకాయలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, దోసకాయ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, కొంతమందికి అంత ప్రమాదకరంగా కూడా ఉంటుందట. దోసకాయలో పీచు పదార్థం ఎక్కువ. ఎక్కువ పీచు చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చట. ఇది గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను పెంచుతుందని, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఇప్పటికే అసిడిటీ లేదా ఉబ్బరం ఉన్నవారు దోసకాయను తక్కువగా లేదా అసలు తీసుకోకూడదని, ఎందుకంటే ఇది వారి సమస్యను మరింత పెంచుతుందని చెబుతున్నారు. కాగా దోసకాయ చలువ చేస్తుంది. ఎవరికైనా కఫం, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే, దోసకాయ తినకపోవడమే మంచిదట.
చలువ చేసే గుణం ఉండటం వల్ల కఫం మరింత పెరగవచ్చట. జలుబు కూడా ఎక్కువ కాలం ఉండవచ్చని, కాబట్టి ఈ స్థితిలో దోసకాయ తినకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత ఎలర్జీ వస్తుంది. దీనికి చాలా లక్షణాలు ఉండవచ్చట. పెదవులు లేదా గొంతులో దురద, వాపు, కడుపు నొప్పి, వాంతి వచ్చినట్లు అనిపించడం వంటివి. ఒకవేళ ఎప్పుడైనా దోసకాయ తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే తినడం మానేయడం మంచిది అని చెబుతున్నారు. దోసకాయ సహజంగా మూత్రవిసర్జనను పెంచుతుందట. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుందని,అలాంటి వారు దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
కాగా దోసకాయ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గించగలదట. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్య ఉంటే, దోసకాయ ఎక్కువగా తింటే మైకం, బలహీనత లేదా అలసట అనిపించవచ్చట. అందుకే తక్కువ రక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలోనే తినాలని నిపుణులు చెబుతున్నారు. కాగా కొంతమంది శరీరాలు త్వరగా కూల్ అవుతాయి. అలాంటి వారికి చల్లని గుణం కలిగిన ఆహారాలు త్వరగా హాని చేస్తాయట. మీ శరీరం త్వరగా చల్లబడితే, చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపు చల్లగా ఉంటే, దోసకాయ మీకు మంచిది కాదని చెబుతున్నారు.
Cucumber Side Effects: ఏంటి.. లో బీపీ ఉన్నవారు దోసకాయ తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Cucumber Side Effects: లో బీబీ సమస్యతో బాధపడుతున్న వారు అలాగే ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కీరదోసకాయ తినకూడదా, తినవచ్చా ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Cucumber
Last Updated: 13 Dec 2025, 08:15 AM IST