Site icon HashtagU Telugu

Health Tips: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ పండ్లు అస్సలు తినకండి.. తిన్నారో!

Which Fruits Are Avoided On An Empty Stomach

Which Fruits Are Avoided On An Empty Stomach

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే అనేక రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే పండ్లను తినడం మంచిదే కానీ శృతిమించి తింటే మాత్రం సమస్యలు తప్పవు. పండ్లు ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా కొంతమంది పరగడుపున కొన్ని రకాల పండ్లు తింటూ ఉంటారు. కానీ ఖాళీ కడుపుతో కొన్ని రకాల పండ్లను అసలు తినకూడదని చెబుతున్నారు. మరి ఖాళీ కడుపుతో ఎలాంటి పనులను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉదయం పూట చాలా ఉంది అల్పాహారానికి బదులు ఖాళీ కడుపుతోనే కొన్ని రకాల పండ్లు తింటూ ఉంటారు. అయితే పండ్లు తినడం మంచిదే కానీ కాలి కడుపున కొన్ని పండ్లను పొరపాటున కూడా తినకూడదని చెబుతున్నారు వైద్యులు యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా అని ఏ ఖాళీ కడుపుతో తింటూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదట. ఖాళీ కడుపుతో పరగడుపున యాపిల్ ని తినడం మంచిది కాదని చెబుతున్నారు. యాపిల్ పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందుకే ఖాళీ కడుపుతో తినడం వల్ల అజీర్తి గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయట. అలాగే అరటి పండును కూడా కాళీ కడుపుతో అసలు తినకూడదట.

అరటి పండులో చక్కరలు, మెగ్నీషియం అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అవుతాయట. అలాగే కొందరిలో గ్యాస్ సమస్య తలెత్తేలా చేస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు సిట్రస్ జాతికి చెందిన పండ్లను కూడా పరగడుపున తినకూడదని చెబుతున్నారు. సిట్రస్ పండ్లు మీ ప్రేగుల్లో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయట. పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని, మీ జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బ తీస్తాయని చెబుతున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా పుచ్చకాయ, బొప్పాయి,పైనాపిల్ వంటి పండ్లను కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఇప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే పనులను తినే ముందు సలహా తీసుకోవడం మంచిది.