Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత పొరపాటున నీటిని అస్సలు తాగకండి.. తాగారో?

నీరు తాగడం మంచిదే కానీ,కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత నీటిని తాగకూడదట.

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

అప్పుడప్పుడు మనం తినే ఆహార పదార్థాల విషయంలో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో పండ్లు తిన్న తర్వాత నీటిని తాగడం కూడా ఒకటి. కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. ఎలాంటి పండ్లు తర్వాత నీళ్లు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ తిన్న తర్వాత ఎప్పుడు కూడా నీటిని వెంటనే తాగకూడదని చెబుతున్నారు.

పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటాయి. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే అరటి పండ్లు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదని చెబుతున్నారు. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు అని అంటుంటారు. మరి అలాంటి యాపిల్ ను తిన్నప్పుడు పొరపాటున కూడా నీటిని తాగితే అది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దానిమ్మ ను తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే ఎసిడిటీ వాంతులు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. సిట్రస్ పండ్లు అనగా నిమ్మకాయ బత్తాయి కమలాపండు వంటివి తిన్న తర్వాత నీరు తాగితే శరీరంలో ఉన్న పీహెచ్ స్థాయిలు తగ్గి జీర్ణ సమస్యలు వస్తాయట.

నేరేడు పండు తిన్న తర్వాత నీరు తాగితే డయేరియా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయట. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న దోసకాయ, కర్బూజా వంటి పండ్లు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదని చెబుతున్నారు. పండ్లు తిన్న తర్వాత నీటిని తాగితే జలుబు చేసే అవకాశాలు ఉంటాయట. కాబట్టి ఇకమీదట అయిన పైన చెప్పిన పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకుండా ఉండడానికి ప్రయత్నించండి.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

  Last Updated: 08 Aug 2024, 05:02 PM IST