Drinking Alcohol: ఆల్కహాల్ తాగే ముందు ఏం తినాలి..ఏం తినకూడదో మీకు తెలుసా?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా మందు బాబులు తాగడం మాత్రం మానేయరు. నిత్యం సినిమా ధియేటర్ లలో,బయట పోస్టర్ లలో బహిరంగ ప్రదేశాలలో

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 05:00 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా మందు బాబులు తాగడం మాత్రం మానేయరు. నిత్యం సినిమా ధియేటర్ లలో,బయట పోస్టర్ లలో బహిరంగ ప్రదేశాలలో ఆఖరికి మద్యం బాటిల్స్ పై కూడా మద్యం సేవించరాదు అని రాసి ఉంటారు. వీటిని మనం తరచూ వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాటిని తాగడం మాత్రం మానుకోరు. అయితే ఆల్కహాల్ తాగడం మంచిదే కానీ పరిమితికి మించి తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా చాలామంది మద్యం సేవించడానికి ముందు మద్యం సేవించిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు తెలిసి తెలియక తీసుకుంటూ ఉంటారు.

వీటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మరి ఆల్కహాల్ సేవించడానికి ముందు ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి? ఆల్కహాల్ సేవించకు ముందు ఎటువంటి పదార్థాలు తినకూడదు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం?ఆల్కహాల్ తీసుకునే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఆల్కహాల్ ప్రభావం శరీరంపై తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకల ఆహారాలు తినడం వల్ల ఆల్కహాల్ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. మొదట ఆల్కహాల్ తాగేముందు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. అరటి పండ్లు, ఫ్రూట్స్.. పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి.

పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నీరు ఆల్కహాల్ ను పలుచన చేస్తుంది. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కోడిగుడ్లు..గుడ్లలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఏ ఆహారమైనా ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నిమ్మరసం దాల్చిన చెక్క, పసుపు వంటివి తీసుకోవడం మంచిది. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో నీరు ముఖ్యం. ఇది ఆల్కహాల్ ను పలుచన చేస్తుంది. ఉప్పు సమతుల్యతను నియంత్రిస్తుంది. ఆల్కహాల్ తాగే ముందు, తాగుతున్నప్పుడు ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అలాగే అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆల్కహాల్ ప్రభావాలను నెమ్మదిస్తాయి.

అవొకాడోలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మరి మద్యం సేవించక ముందు ఏం తినకూడదు అన్న విషయానికి వస్తే.. ఒక కప్పు కాఫీ తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం ఇది. అయితే శరీరం డీహైడ్రేట్ కావడాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి మద్యం సేవించక ముందు కాఫీ ని తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్.. ప్రాసెస్డ్ ఫుడ్స్, అర్టిఫీషియల్ షుగరీ ఫుడ్స్, కార్బొనేటెడ్ వాటర్, కార్బోహైడ్రేట్ ఆహారాలు ఏమాత్రం ఆరోగ్యకరమైనవి కావు. ఇందులోని అధిక ఉప్పు వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అదేవిదంగా ఉప్పు లేకుండా ఏ వంటకాలు రుచిగా ఉండలేవు. అయితే అధికంగా ఉప్పు ఉండే ఆహారాల వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ ఆహారాలు తిన్న తర్వాత ఆల్కహాల్ తాగితే మరింతగా డీహైడ్రేట్ కు గురవుతారు.