ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. చిన్న పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వరకు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే మరి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కిడ్నీలో రాళ్ల సమస్య నొప్పి అన్నది భరించలేని విధంగా ఉంటుంది. ఇకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రెడ్ మీట్ వంటి మాంసాహారం తినకూడదట. ఎందుకంటే ఇవి మూత్రంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయట. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందట. అలాగే వీళ్లు స్వీట్లు, కెఫిన్ ను కూడా తీసుకోకూడదట. ఎందుకంటే ఇవి కూడా మూత్రంలో కాల్షియం లెవెల్స్ ను పెంచి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కూడా దారితీస్తుందట. అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు పొరపాటున కూడా ఆల్కహాల్ ను తాగకూడదట. ఎందుకంటే ఇది శరీరంలో వాటర్ లెవెల్స్ ను తగ్గిస్తుందట. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందట.
కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నవారు ఉప్పును చాలా వరకు తగ్గించాలట. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మూత్రపిండాల్లో రాళ్లు మరింత పెరుగుతాయట. అదనపు సోడియం కాల్షియం ఏర్పడటాన్ని పెంచుతుందట. అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటివి తినకూడదట. కాగా సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందట. ఈ సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని ఎక్కువగా తింటే ఆక్సలేట్ ఉత్పత్తి పెరుగుతుందట. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వీటిని తినడం మానేయడం మంచిదనీ చెబుతున్నారు. సోడా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మీ మూత్రపిండాల్లో రాళ్ల సైజును మరింత పెంచుతుందట. సోడాలో ఉండే ఉండే ఫాస్బారిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని మరింత పెంచుతుందట.