Site icon HashtagU Telugu

Which Oil Best For Heart: గుండె హెల్త్ కు.. ఏ ఆయిల్ బెస్ట్..?

Edible Oil Import

Cooking Oil

మన గుండెకు ఏ వంట నూనె మంచిది..? ఏ నూనె వాడితే మన గుండె సేఫ్ గా ఉంటుంది..? ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. వీటికి వైద్య నిపుణులు ఏం సమాధానాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం..!

కూరగాయల నూనెలు బెస్ట్

ఆరోగ్యకరమైన వంట నూనెల్లో ఎక్కువగా పాలీ అసంతృప్త కొవ్వులు,మోనో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL)ని అదుపులో ఉంచడంలో ఇలంటూ వంట నూనెలు సహాయపడతాయి. ఇక జంతువుల కొవ్వు నుంచి తయారయ్యే ఆయిల్స్ కంటే కూరగాయల నూనెలు (వెజిటబుల్ ఆయిల్స్) సురక్షితమైనవి. గింజల నుంచి తీసిన నూనె ఏదైనా మంచిదే. మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అనగా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు. ఇవి ఉండేటువంటి నూనెల లిస్టులో ఆలివ్ ఆయిల్, కెనొలా ఆయిల్, పల్లీ నూనె, నువ్వుల నూనె ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నూనెలను ఉపయోగించండి.

గుండె ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే వంట చేయడానికి ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం మేలు. అంతే కాక కోకోనట్ ఆయిల్‌తో ఇతర ఆయిల్స్‌ను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్నప్పుడు శరీరంలో ఉండేటు వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. కానీ కొబ్బరి నూనె ను తీసుకోవడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా లభిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే ఆలివ్ ఆయిల్‌ను కొన్ని రకాల డైట్ ప్లాన్స్‌లో ఉపయోగిస్తారు అంటే మెడిటేరియన్ డైట్ వంటి వాటిలో ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. సలాడ్స్ వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకునే వారు కూడా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

ఈ ఆయిల్స్ వద్దు

వనస్పతి, పందికొవ్వు, జంతువుల కొవ్వు, కొబ్బరి నూనెలలో అధిక సంతృప్త కొవ్వులు ఉంటాయి. కొబ్బరి నూనెను ఎక్కువగా ఫుడ్ లో వాడితే మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

■ ఆయిల్ తో డీప్ ఫ్రై వద్దు

నూనెను బాగా వేడి చేస్తే.. అది దాని మంచి లక్షణాలను కోల్పోతుంది. కాబట్టి ఫుడ్ ఐటమ్స్ ను డీప్ ఫ్రై చేయడం మానుకోండి. అలా చేస్తే ఆయిల్ అనేది ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారుతుంది. అలాంటి ఆయిల్ తో తయారు చేసిన ఫుడ్ తిన్నాక.. శరీరంలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రీ రాడికల్స్‌ విడుదల అవుతాయి. ఫలితంగా గుండె పై ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోయే ముప్పు పెరుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు.

■ రోజువారీ ఆహారంలో 15 శాతంలోపే ఉండాలి

నూనెలు అనేవి కొవ్వు యొక్క ఒక రూపం. ఇవి శక్తి కోసం, జీర్ణక్రియను సులభతరం చేయడానికి, విటమిన్ శోషణకు ఉపయోగపడతాయి.
రోజువారీ ఆహారంలో 10 నుంచి 15 శాతం కొవ్వులు అవసరం. మనం వాటిని ఆ పరిమితిలోపే ఉంచాలి.

■ మంచి కొలెస్ట్రాల్ VS చెడు కొలెస్ట్రాల్

ఇక మన కాలేయంలో తయారయ్యే కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా ఇది మన శరీరానికి అందుతుంది. కొలెస్ట్రాల్‌లో హై- డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL), లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) అనే రెండు రకాలు ఉంటాయి. లిపోప్రొటీన్లు కొవ్వు, ప్రోటీన్ల సమ్మేళనంగా ఇవి ఏర్పడతాయి. లిపిడ్లు ప్రోటీన్లతో కలిసి రక్తం ద్వారా శరీర భాగాలు, కణాలకు చేరుకుంటాయి. వీటిలో HDLను మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇది మానవ కాలేయానికి కొలెస్ట్రాల్‌ను రవాణా చేస్తుంది. ఇది శరీర జీవక్రియలకు ఎంతో ఉపయోగపడుతుంది. అధిక HDL స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  LDL కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి హాని చేస్తుంది.. దేహంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వస్తాయి. అంతేకాకుండా పక్షవాతం వచ్చే అవకాశం లేకపోలేదు.

■ వేరుశెనగ నూనె గురించి

వేరుశెనగ నూనెలో ఒమేగా-3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొందరు మహిళల్లో రొమ్ము కేన్సర్ కు కారణమవుతుందని అంటారు. అలాగే వేరుశనగకు అలెర్జీ ఉన్నవారు వేరుశనగ నూనెకు కూడా దూరంగా ఉండాలి. వేరుశెన‌గ నూనెలో రెస్వెట్రాల్  యాంటీ యాక్సిడెంట్  ఉంటుంది. ఇది అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా స‌హాయ‌ప‌డ‌డంతో పాటు ఆలోచ‌నా శ‌క్తిని రెట్టింపు చేస్తుంది. ఈ నూనెలో ఉండే విట‌మిన్ ఈ‌ చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌ల‌ను, స‌న్న‌ని గీత‌ల‌ను త‌గ్గించి, య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుస్తుంది.

■ పామాయిల్‌ డేంజర్

పామాయిల్‌లో సంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. పామ్ ఆయిల్‌తో తయారు చేసిన జంక్‌ఫుడ్‌ తినడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోయి గుండె జబ్బుల వంటి అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.