భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

ఐదో స్థానంలో ఉన్న ఈ క్యాన్సర్ పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోంది. పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం దీనికి కారణాలు.

Published By: HashtagU Telugu Desk
Cancer

Dangerous Cancer

Cancer: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ‘క్యాన్సర్ రీసెర్చ్ యూకే’ ప్రకారం.. క్యాన్సర్‌లో 200 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ప్రారంభమయ్యే కణాల ఆధారంగా వీటిని ఐదు ప్రధాన వర్గాలుగా విభజించారు.

కార్సినోమా (Carcinoma): ఇది చర్మం లేదా అంతర్గత అవయవాల పొరల నుండి ప్రారంభమవుతుంది.

సార్కోమా (Sarcoma): ఎముకలు, కండరాలు, కొవ్వు లేదా రక్తనాళాల వంటి కణజాలాలకు సోకుతుంది.

ల్యూకేమియా (Leukemia): రక్తకణాలను తయారు చేసే ఎముక మజ్జ నుండి ప్రారంభమై, తెల్ల రక్తకణాలపై ప్రభావం చూపుతుంది.

లింఫోమా- మైలోమా (Lymphoma & Myeloma): ఇవి రోగనిరోధక వ్యవస్థ కణాలకు సంబంధించినవి.

సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ క్యాన్సర్: మెదడు, వెన్నెముకకు సంబంధించిన క్యాన్సర్లు ఈ వర్గంలోకి వస్తాయి.

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు

నిపుణులు భారతదేశంలో క్యాన్సర్ పరిస్థితుల గురించి వివరించారు. కొన్ని ఏళ్ల క్రితం వరకు మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) ఎక్కువగా ఉండేది, రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానానికి చేరుకుంది. మారిన జీవనశైలి, పెరుగుతున్న వయస్సు, తల్లి పాలు పట్టడం తగ్గడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

Also Read: శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

ఇతర ప్రధాన క్యాన్సర్లు, కారణాలు

భారతదేశంలో క్యాన్సర్ల వ్యాప్తి ఈ కింది విధంగా ఉంది.

నోటి క్యాన్సర్ (Mouth Cancer): ఇది రెండో స్థానంలో ఉంది. ప్రధానంగా పొగాకు నమలడం వల్ల ఇది సంభవిస్తుంది.

గర్భాశయ- ఊపిరితిత్తుల క్యాన్సర్ (Cervical & Lung Cancer): ఇవి మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం ప్రధాన కారణం.

కోలన్ క్యాన్సర్ (Colon Cancer): ఐదో స్థానంలో ఉన్న ఈ క్యాన్సర్ పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోంది. పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం దీనికి కారణాలు.

నిపుణుల సూచనలు

క్యాన్సర్ అనేది అకస్మాత్తుగా వచ్చే వ్యాధి కాదని నిపుణులు వివరించారు. దీని వెనుక జన్యుపరమైన కారణాలతో పాటు జీవనశైలి, పర్యావరణ ప్రభావం కూడా ఉంటుంది.

నివారణ మార్గాలు: సరైన సమయంలో పరీక్షలు (Screening), స్వయంగా పరీక్షించుకోవడం (Self-examination), మరియు మ్యామోగ్రఫీ వంటివి ప్రాణాలను కాపాడగలవు.

టీకా: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి HPV వ్యాక్సినేషన్, క్రమం తప్పకుండా తనిఖీలు చేసుకోవడం చాలా అవసరం.

జాగ్రత్తలు: పొగాకు, మద్యం మానుకోవడం, బరువు తగ్గడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు.

  Last Updated: 20 Feb 2026, 11:29 PM IST