Harmed Food: ఆరోగ్యకరమైన ఆహారం ఆయుష్షును పెంచుతుంది. కానీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన శరీర అవయవాలకు తీవ్ర హాని కలిగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనకు తెలియకుండానే మనం తీసుకునే కొన్ని పదార్థాలు మెదడు, కాలేయం, కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో తెలుసుకుని మన డైట్ చార్ట్ నుండి వాటిని తొలగించడం మంచిది.
శరీర అవయవాలకు హాని చేసే పదార్థాల లిస్ట్ ఇదే
అవయవాలకు హాని కలిగించే ఆహారాలు
కాలేయం కోసం: మితిమీరిన మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ ప్రభావం నేరుగా కాలేయంపై పడి, అది పూర్తిగా దెబ్బతినేలా చేస్తుంది.
గుండె కోసం: నూనెలో వేయించిన పదార్థాలు, అధిక ఉప్పు కలిగిన ఆహారాలు గుండెకు ప్రధాన శత్రువులు. వీటిలోని ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును పెంచుతాయి.
కళ్ళు కోసం: కళ్ళ ఆరోగ్యానికి అతిగా తీపి తినడం మంచిది కాదు. ఇది కంటి చూపుపై ప్రభావం చూపడమే కాకుండా ‘డయాబెటిక్ రెటినోపతి’ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక చక్కెర వినియోగానికి దూరంగా ఉండాలి.
Also Read: మళ్లీ తగ్గిన బంగారం ధర.. రూ.4000 పడిపోయిన వెండి..ఈరోజు రేట్లు ఇవే!
కిడ్నీల కోసం: ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కిడ్నీలపై భారం పెరుగుతుంది. రక్తాన్ని వడపోసే క్రమంలో కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి. కిడ్నీల ఆరోగ్యానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
ఊపిరితిత్తుల కోసం: సల్ఫేట్ కలిగిన ఆహార పదార్థాలు ఊపిరితిత్తులకు హానికరం. మార్కెట్లో దొరికే పచ్చళ్లు, బాటిళ్లలో నిల్వ ఉంచిన జ్యూస్‌లలో సల్ఫేట్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులలో మంట లేదా చికాకును కలిగిస్తుంది.
ఆరోగ్యంగా ఉండటానికి ఏమి తినాలి?
నిపుణుల సూచన ప్రకారం.. ఈ హానికర పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం ఈ క్రింది అలవాట్లు పాటించాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- రోజూ తగినంత నీరు త్రాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
