Site icon HashtagU Telugu

Tea: నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Tea

Tea

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టీ, కాఫీలు తాగుతూనే ఉంటారు. ఒకరోజు కాఫీలు టీలు తాగకపోతే ఏదో కోల్పోయిన వారిలా ఏదో పోగొట్టుకున్న వారిలా ఉంటారు. కనీసం రోజులో ఒక్కసారైనా కాఫీ టీ తాగాల్సిందే. ఇకపోతే కాఫీలు టీలు తాగడం మంచిదే కానీ శృతి మించి తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ నెలరోజులపాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీ ప్రియులకు, ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాల్ అని చెప్పాలి. కానీ టీ తాగడం మానేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మామూలుగా టీ లో చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల కేలరీలు పెరుగుతాయి. అయితే టీలో అధిక చక్కర జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది అని చెబుతున్నారు. చక్కెర కలిపిన టీ తాగడం మానేస్తే మీ జీర్ణ క్రియ మెరుగుపడుతుందట. అలాగే ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట.

రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు.అలాగే మీ దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ చర్మం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందట. ఎందుకంటే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయట. అయితే చక్కెరను పూర్తిగా మానేసిన మొదటి కొన్ని రోజుల్లో మీరు అలసట లక్షణాలను అనుభవించవచ్చు అని చెబుతున్నారు. నెల రోజులపాటు టీని తాగడం మానేస్తే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. టీ తాగడం వల్ల చర్మం పై దద్దుర్లు బబ్బుర్లు వస్తాయి. టీ తాగడం మానేస్తే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట. టీ తాగడం మానుకోవడం వల్ల గుండెల్లో మంట తల తిరగడం హృదయ స్పందన రేటు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మీ చేతులు వణుకుతుంటే టీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందట. అంతేకాకుండా, మీరు టీ తాగడం మానేస్తే, అధిక రక్తపోటు సాధారణమవుతుందని చెబుతున్నారు.