Health Tip: మాంసం ఎక్కువగా తిన్నా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఈ ఆకు తినాల్సిందే?

మామూలుగా మాంసం ప్రియులకు వారంలో కనీసం నాలుగు లేదా ఐదు సార్లు అయినా మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. కొందరు చికెన్ తింటే మరికొందరు

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 07:00 PM IST

మామూలుగా మాంసం ప్రియులకు వారంలో కనీసం నాలుగు లేదా ఐదు సార్లు అయినా మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. కొందరు చికెన్ తింటే మరికొందరు మటన్ కొందరు చేపలు తింటూ ఉంటారు. ఇలా ఏదైతేనేం ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి అంతే. అయితే ఇలా చికెన్,మటన్, చేపలు తినడం మంచిదే కానీ ఎక్కువగా తింటే మాత్రం అనేక రకాల సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. నిత్యం చికెన్, మటన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువ అవుతుంది. అలాగే ఎమైనో యాసిడ్, హోమోసిస్టీన్ విపరీతంగా పెరిగి పోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

శరీరంలో ఎక్కువగా పెరిగే హోమోసిస్టీన్ ను తగ్గించకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా జీర్ణక్రియ దెబ్బ తింటుంది. నాన్ వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా అలా తింటూ పోతే జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఆ సమస్యల నుండి బయట పడేందుకు ఈ ఆకులతో చేసిన కూర చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు చికెన్ మటన్ వంటి మాంసాహారం ఎక్కువగా తిన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఆకును తినాల్సిందే. ఇంతకీ ఆ ఆకు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ ఆకు మరేదో కాదు బచ్చలకూర. కొద్ది మంది మాత్రమే ఈ బచ్చల కూరను ఇష్టంగా తింటారు.

మరి కొందరైతే బచ్చలకూరను తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈ బచ్చలకూర సీజన్ తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ దొరుకుతుంది. ఇది చాలా చౌక కూడా. వీటిలో ఉండే 104 మైక్రో గ్రామ్స్ ఫోలేట్ అనేది ఈ హోమోసిస్టీన్ ను అడ్డుకుని ప్రోటీన్ గా మారుస్తుంది. అలా ప్రోటీన్ గా మార్చి శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఇతర దేశాల వారు నాన్ వెజ్ ను రెండు పూటలా తింటారు. కానీ వారికి ఈ సమస్య చాలా తక్కువగానే తలెత్తుతుంది. వాళ్లకి గుండె సంబంధింత వ్యాధులు తక్కువగా వస్తుంటాయి. ఆహారం సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా అవుతుంది. ఆకు కూరలను స్టీమ్ చేసేసి శాండ్విచ్ లో వాటిలో ఎక్కువగా వాడతారు. విదేశీయులు ఎక్కువగా సలాడ్స్ లో ఆకు కూరలను తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆకులతో తయారు చేసే జ్యూసులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నేచురల్ డైట్ ఎక్కువగా వాడటం వల్ల నాన్ వెజ్ ల సైడ్ ఎఫెక్ట్స్ నుండి వాళ్లు తప్పించుకుంటారు. మన దేశంలో ఆకు కూరలు, పండ్లను చాలా తక్కువగానే తీసుకుంటారు. మన వాళ్లు ఆరోగ్యం కంటే కూడా రుచికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అలాగే పండ్లను తీసుకోవడం చాలా చాలా తక్కువ.