Coconut Water: కొబ్బరి నీళ్లలో తేనె కలుపుకొని తాగితే లాభమా? నష్టమా?

కొబ్బరి నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి. అందుకే చాలామంది సమ్మర్ వచ్చింది అంటే చాలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడానికి

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 08:00 AM IST

కొబ్బరి నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి. అందుకే చాలామంది సమ్మర్ వచ్చింది అంటే చాలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడానికి ఎక్కువ ముగ్గు చూపుతూ ఉంటారు. ఈ కొబ్బరినీళ్లు ఎటువంటి రసాయనాలు లేకుండా ఉండడంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్ లు, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరి నీటిలో 94 శాతం నీరు ఉండి తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే మాంగనీస్ కొవ్వు మెటబాలిజం ఎంజైమ్ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది.

అలాగే కొబ్బరినీరు అధిక రక్తపోటు నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఇ లు ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం సమస్య కూడా తొలగిపోతుంది. అలాగే తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా కావాలి అంటే కొబ్బరి నీళ్లలోని అమినో యాసిడ్ తోడ్పాటు ఇస్తుంది. ఇటువంటి కొబ్బరి నీటిలో తేనె కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరినీటిలో తేనె ను కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే పేగులలో మలినాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్ సమస్యలు కడుపులో మంట అల్సర్ తగ్గుతుంది. ఇక కిడ్నీలో రాళ్లు కరిగి కొలెస్ట్రాల్,బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే కొబ్బరి నీటిలో తేనెను కలుపుకొని తాగడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. అంతేకాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.