Site icon HashtagU Telugu

Benefits of Garlic: ప్రతిరోజూ ఒక్క వెల్లుల్లి తింటే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయ్ ?

Garlic Benefits

Garlic Benefits

మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి అన్నది సంజీవని లాంటిది. ఈ వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉండి,కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. వెల్లుల్లిలో ఉండే చిన్న చిన్న పాయలు విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్ష క్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకుపంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అలాగే వెల్లుల్లి లో బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం అంటే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదేవిధంగా ఋతువులు మారే సమయంలో వచ్చే జలుబు దగ్గు కఫం వంటి వాటిని నయం చేయడానికి వెల్లుల్లి రెబ్బలు బాగా ఉపయోగపడతాయి.

ఈ వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం గొంతులో ఉండే బ్యాక్టీరియాని చంపుతుంది. అయితే ఇందులోని క్రియాశీలక సమ్మేళనాలు అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా బాగా సహాయపడతాయి. అందువల్ల గుండెపోటులు స్ట్రోక్లు వంటి హృదయ సంబంధ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రతిరోజు కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయినా పరగడుపున తినవచ్చు. ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విడ్ని మనం తినే ఆహారంలో తీసుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి మానసిక వ్యాధులు రాకుండా కాపాడతాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక వెల్లుల్లి ముక్కను తినడం వల్ల అది సర్వరోగనివారిని గా కూడా పనిచేస్తుంది.

ఇందులో ఏ, బి, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి సూక్ష్మజీవులను నశింప చేస్తుంది. అదేవిధంగా శరీరంలోని టిష్యూ కణాల్ని అభివృద్ధి చేయడంలో వెల్లుల్లి బాగా సహకరిస్తుంది. వెల్లుల్లినీ రాత్రి పడుకునే ముందు దిండు కింద పట్టుకొని పడుకోవడం వల్ల బాగా నిద్ర పడుతుంది.