Site icon HashtagU Telugu

Weight Loss Tips: అధిక బరువును వేగంగా తగ్గించే మూడు రకాల టీలు..ఏవో తెలుసా?

Weight Loss Tips

Weight Loss Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కొంచెం తిన్న లావై పోతున్నాము అని ఫీల్ అయిపోతూ ఉంటారు. బరువు తగ్గడం కోసం జింక్ వెళ్లడం వాకింగ్ చేయడం అలాగే ఆహారం తినకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లావు తగ్గక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తినడం మానేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అధిక బరువు తగ్గించడానికి మూడు రకాల టీలు ఎంతో బాగా పనిచేస్తాయి. ఆ టీలు కొవ్వును కరిగించడంతోపాటు కేలరీలు అయ్యేలా చేస్తాయి. మరి బరువును తగ్గించే ఆ టీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా బరువు పెరగడం చాలా ఈజీ కానీ బరువు తగ్గడానికి చాలా కష్టం. ఇకపోతే సాధారణంగా టీ లో కాటెచిన్ లు అని పిలువ బడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి శరీరం కొవ్వును వేగంగా విచ్ఛిన్నం చేయడానికి,ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఎంతో బాగా సహాయపడతాయి. బరువు తగ్గించే ఆ మూడు టీల విషయానికి వస్తే.. మొదటిది దాల్చిన చెక్క టీ. ఈ టీ మీకు బరువు తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే దాల్చిన చెక్క టీను తాగడం వల్ల అది జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

ఈ టీలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తాయి. రెండవది గ్రీన్ టీ. బరువు తగ్గడానికి ఉపయోగించే సాధారణ టీలలో గ్రీన్ టీ కూడా ఒకటి. గ్రీన్ టీ లో కాటెచిన్స్ అనే పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తాయి. ఇది బరువును తగ్గించడంతోపాటు అధిక మొత్తంలో కేలరీలను బర్న్ చేస్తాయి. బ్లాక్ కాఫీ.. ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి బ్లాక్ కాఫీలో చక్కెర కలపకుండా ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. అలాగే కాఫీ ని ఎప్పుడు మోతాదుకు మించి తీసుకోకూడదు. కాఫీ నీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్యతో పాటు ఆందోళన లాంటి సరికొత్త సమస్యలకు దారితీస్తుంది.

Exit mobile version