Drinking water: భోజనం తర్వాత వెంటనే దాహం వేస్తే ఏం చేయాలి

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 03:45 PM IST

చాలామంది ఈరోజుల్లో మంచి ఆహార అలవాట్లను పాటిస్తున్నా కొన్ని తప్పులను తెలియకుండా చేస్తున్నారు. భోజనం వేళకి ఎలా తినాలో అలాగే మంచినీటిని కూడా ఒక క్రమపద్ధతిలో తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మంచినీటిని ఎలా తాగాలో తెలుసుకుందాము. అంతర్గత అవయవాలు పనితీరు మెరుగుపడాలంటే ఉదయాన్నే 2 గ్లాసుల మంచినీరు తాగాలి. దాహం వేస్తే, భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. నీరు త్రాగేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకూడదు. ఎప్పుడూ కొద్దికొద్దిగా నీరు త్రాగాలి.

ఆహారం తినే ముందు లేదా తిన్న తర్వాత వెంటనే ఎప్పుడూ నీరు త్రాగకూడదు. ఇలా తాగితే ఆ నీరు గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేసి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు దాహం ఎక్కువగా అనిపిస్తే 1, 2 గుటకల నీరు మాత్రమే తాగాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగాలి. స్నానం చేసే ముందు గ్లాసు మంచినీరు తాగితే రక్తపోటు అదుపులో వుంటుంది. రాత్రి వేళ పడుకునే ముందు గ్లాసు మంచినీరు తాగితే గుండెపోటు, గుండె సమస్యలను దూరం చేయవచ్చు.

నీరు ఎంత తాగితే.. అంత మంచిది. శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరు ఎంతో ముఖ్యం. అయితే, ఉదయాన్నే నీటిని తీసుకోవాలి. అయితే, ఎంత తీసుకోవాలి. సాధారణంగా మన శరీరంలో అవయవాలకు మూడు వంతుల నీరు తాగడం మంచిదని చెబుతారు. సమ్మర్‌లో అయితే ఈ నీటిశాతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే… ఎవరు ఎంత నీరు తీసుకోవాలో తెలుసుకోండి..

ఇప్పుడు రోజంతా కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.. ఇక ఉదయమే.. కనీసం రెండు గ్లాసుల నీరు తాగాలి. ఇలా తాగడం వల్ల బాడీలో జీవక్రియలు సరిగ్గా ఉంటాయి. కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇక పిల్లల విషయానికొస్తే వారికి 3 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగించాలి. ఉదయాన్నే ఓ గ్లాసు నీటిని తాగించడం మంచిది. ఇలా చేయడం వల్ల వారికి చిన్నప్పట్నుంచే నీటిని అలవాటు చేసిన వారవుతాం.