Site icon HashtagU Telugu

Blood Pressure: మీకు కూడా బీపీ ఉందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!

Blood Pressure

Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. చాలామంది ఈ విషయాన్ని చాలా చిన్నదిగా భావిస్తుంటారు. కానీ ఈ రక్తపోటును సకాలంలో గుర్తించకపోతే ప్రాణాల మీద కూడా వస్తుందని చెబుతున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కొన్ని కొన్ని సార్లు ఈ అధిక రక్తపోటు గుండెపోటుకు కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు. అయితే ఈ అధిక రక్తపోటుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తినడం ఊబకాయం ధూమపానం ఒత్తిడి ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి.

ఇవి రక్తపోటును పెంచుతాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా రక్తపోటు పెరుగుతుందని చెబుతున్నారు. మరి బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అందుకే బీపీ పేషెంట్లు కాఫీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఉప్పును ఎక్కువగా తినకూడదట. ఉప్పును రోజుకు ఆరు గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలట. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

ముఖ్యంగా బీపీ ఉన్నవారు నూనెలో వేయించిన ఫ్రై చేసిన ఆహారాలు చాలా తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. నూనెలో ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలు రక్తపోటును మరింత పెంచుతాయట. అందుకే రక్తపోటు ఉన్నవారు వీటిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే జంక్ ఫుడ్స్ టేస్టీగా ఉన్నప్పటికీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాబట్టి రక్తపోటును నియంత్రించడానికి జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. కాగా జంక్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి మీరు ప్రాసెస్ చేసిన మాంసం, మటన్, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యం రిస్క్ లో పడుతుందట. అందుకే వీటికీ వీలైనంతవరకూ దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.