Site icon HashtagU Telugu

Period Pain: ఈ టీ తాగితే చాలు పీరియడ్స్ నొప్పి మాయం అవ్వాల్సిందే?

Mixcollage 15 Jul 2024 06 01 Pm 7079

Mixcollage 15 Jul 2024 06 01 Pm 7079

మామూలుగా స్త్రీలకు నెలసరి రావడం అన్నది సహజం. అయితే కొంతమంది స్త్రీలకు ఈ నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు ఆ నొప్పికి విలవిల్లాడుతూ ఉంటారు. అయితే ప్రతి నెల ఈ విధంగా ఆ నెలసరి నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ మూడు రోజులపాటు కొంతమంది నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇక ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల మెడిసిన్స్ ఆయుర్వేద చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ నొప్పి నుంచి ఉపసమనం పొందడం కోసం మందులను ఎంత ఎక్కువగా వాడితే ఆరోగ్యం అందగా దెబ్బతింటుందని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు.

అందుకే చాలా వరకు స్త్రీలు ఈ నెలసరి నొప్పిని తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు వంటింటి చిట్కాలు అనే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నెలసరి నొప్పి నుంచి తగ్గించే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది అంటున్నారు వైద్యులు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా మనం అల్లం టీ తాగుతూ ఉంటాం. అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అల్లం టీ పీరియడ్స్ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుందట. పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు వైద్యులు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కడుపు మంట నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

అదేవిధంగా పసుపు కూడా అందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పసుపు నెలసరి సమయంలో వచ్చే మంటను నొప్పిని తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. నెలసరి నొప్పి సమయంలో పుదీనా టీ చేసుకుని తాగడం వల్ల కూడా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.. అలాగే చామంతి టీ తాగడం వల్ల కూడా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు వైద్యులు. దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చినచెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పీరియడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

note : పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి మాత్రమే సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.