మామూలుగా తలనొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువ సేపు బయట తిరగడం, అతిగా ఆలోచించడం, స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం ఇలా అనేక రకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారి కొంతమంది టాబ్లెట్లు ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తలనొప్పి భరించలేని విధంగా తల పగిలిపోయేలా ఉంటుంది. ఈ తలనొప్పి కారణంగా ఎలాంటి పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. తలనొప్పిని భరించలేకపోతుంటారు. అయితే ఇక మీదట మీకు ఆ భయం అవసరం లేదు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే తప్పకుండా తలనొప్పి మాయం అవుతుందని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లవంగం నూనె తలనొప్పిని తగ్గించడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. ఈ నూనెకు బ్యాక్టీరియా కణాలను చంపే శక్తి కూడా ఉంటుందని,లవంగం నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని,దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయని, ఇవి మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు. తలనొప్పి వచ్చినప్పుడు లవంగం నూనెను తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల మీ తలను చల్లగా చేసి నొప్పిని తగ్గిస్తుందట.
లవంగం నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పిని వెంటనే తగ్గించడానికి బాగా సహాయపడతాయట. తలనొప్పి ఒత్తిడి వల్ల కూడా వస్తుంటుందట. అయితే ఈ లవంగం నూనెను వాడితే ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం నుదిటిపై ఈ నూనెను వృత్తాకార కదలికలో అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలట. అదేవిధంగా లవంగం నూనెలో ఫ్లేవనాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇవి తలనొప్పిని వెంటనే తగ్గించడానికి సహాయపడతాయట. ఈ నూనె శరీర మంటను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని,అలాగే నొప్పిని తగ్గిస్తుందని చెబుతున్నారు. లవంగం నూనెను తయారుచేయడానికి 5 నుంచి 6 గ్రాముల లవంగాలను తీసుకుని గ్రైండ్ చేసి కొబ్బరి నూనెలో ఈ పొడిని చేయాలి. అంతే ఈ నూనెను తలకు పట్టించి మసాజ్ చేయాలట. ఈ నూనెతో తలను మసాజ్ చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు.