Stickers on Fruits : పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో తెలుసా?

పండ్లపై కూడా స్టిక్కర్లు వేస్తుంటారు. ఎక్కువగా ఆపిల్స్, బత్తాయి, కివి వంటి పండ్ల మీద స్టిక్కర్లు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 10:09 PM IST

మనం చీరలు, సామాన్లు, వాటర్ బాటిల్స్ ఏమైనా కొన్నా వాటిపైన స్టిక్కర్లు వేస్తుంటారు. అదేవిధంగా పండ్లపై కూడా స్టిక్కర్లు వేస్తుంటారు. ఆ స్టిక్కర్ల మీద క్యూ ఆర్ కోడ్, దాని ధర, కోడ్ నంబర్లు కూడా ఉంటాయి. ఎక్కువగా ఆపిల్స్, బత్తాయి, కివి వంటి పండ్ల మీద స్టిక్కర్లు ఉంటాయి. ఇవి వేరే ప్రదేశాల నుండి రావడం వలన ఇవి తినడం వలన మనకు మంచిది అని అనుకుంటారు. వాటిని ఎక్కువగా కొని తింటూ ఉంటారు.

స్టిక్కర్ల పైన మూడు లేదా నాలుగు నంబర్లు ఉంటె సహజసిద్దమైన ఎరువులు, కృత్రిమ రసాయనాలు రెండింటిని ఉపయోగించి పండించిన పండ్లు అని అర్ధం. ఆ స్టిక్కర్ల పైన ఐదు అంకెల సంఖ్య ఉండి తొమ్మిది అంకెతో మొదలవుతూ ఉంటె ఆ పండ్లని సేంద్రీయ ఎరువులతో, సహజ సిద్ధమైన పద్దతులతో పండించినట్లు అర్ధం. ఇవి చాలా సురక్షితమైనవి వాటిని తినడం వలన మన మన ఆరోగ్యానికి కూడా మంచిది.

పండ్ల మీద ఉండే స్టిక్కర్ల మీద ఐదు అంకెల సంఖ్య ఉండి దాని మీద ఎనిమిదితో మొదలయితే జన్యుపరంగా సవరించినట్లు, జన్యుమార్పిడి చేసిన పండ్లు అని అర్ధం. వాటిని తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అలా ఉన్న పండ్లను కొనడం తినకపోవడం మంచిది కాదు. కానీ మన దేశంలో మాత్రం చాలా మంది ఎలా పడితే అలా స్టిక్కర్లను పండ్ల మీద అతికించి విరివిగా వాడుతున్నారు. అవి నకిలీవా లేదా మంచివా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ స్టిక్కర్స్ ఉన్నాయి కదా అవి మంచివేమో అని మనం ఫీల్ అయి కొనేస్తామని చాలామంది ఈ మధ్య స్టిక్కర్స్ అతికిస్తున్నారు పండ్లకు. కొన్ని ఫ్రూట్స్ మీద మాత్రం కంపెనీ లోగోలు ఉన్న స్టిక్కర్స్ వేస్తారు. ఇలాంటివి ఇంపోర్టెడ్ పండ్లని అర్ధం.

 

Also Read : Bichagadu : బిచ్చగాడు సినిమాలో శ్రీకాంత్? అంతా ఓకే.. కానీ ఎందుకు క్యాన్సిల్ అయింది?