Site icon HashtagU Telugu

Black Heads: ముక్కు మీద నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Black Heads

Black Heads

మామూలుగా ముక్కు పైన నల్లటి మచ్చలు రావడం అన్నది సహజం. ఒక వయసు వచ్చిన తర్వాత ఈ విధంగా మొక్కపై నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో బ్లాక్ హెడ్స్ అని కూడా అంటూ ఉంటారు. అయితే కొంతమందికి నల్లటి మచ్చలు కనిపించి కనిపించని విధంగా ఉంటే మరి కొంతమందికి ముక్కు మీద నల్లగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని పోగొట్టుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగించడంతో పాటు హోమ్ రెమెడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు.

అయితే మీరు కూడా ఇలా ముక్కు మీద నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతుంటే, అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం శనగపిండి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. శెనగపిండిలో ఉండే లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. చర్మ సంక్రమణను నివారించడంలో శనగపిండి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. కాగా
శనగపిండి ముఖంపై ఉన్న రంధ్రాలను డీప్ క్లీనింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందట. అలాగే రోజు వాటర్ వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

రోజ్ వాటర్ మన స్కిన్ పీహెచ్ స్థాయిని నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది. ఇది నల్లటి మచ్చలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. అయితే రోజ్ వాటర్ ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడి రంధ్రాలు తగ్గుతాయట. రోజ్ వాటర్ ముఖానికి టోనర్ గా కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నల్లటి ముచ్చలను తొలగించుకోవాలంటే.. ఏం ఒక గిన్నెలో 2 చెంచాల శెనగపిండి తీసుకుని అందులో 2, 3 చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముక్కుపై ఉన్న నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. తర్వాత చేతులతో తేలికగా మసాజ్ చేయాలి. ఇది ఫేస్ స్కిన్ కు మంచి ఫేస్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను ముక్కుకు 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అలాగూ దూది, నీళ్ల సాయంతో ముక్కును క్లీన్ చేయాలి. ఇలా వారానికి 4 సార్లు చేయడం వల్ల మీ ముఖం అందంగా కనిపిస్తుంది. నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.

note: ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.