Almond: బాదం పప్పులను నానబెట్టి మాత్రమే ఎందుకు తినాలో తెలుసా?

బాదం పప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదంపప్పుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే వైద్యులు కూడా బాదంపప్పుని తరచుగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. బాదంపప్పులో ఫ్యాట్స్ ప్రోటీన్స్

  • Written By:
  • Publish Date - July 26, 2024 / 01:40 PM IST

బాదం పప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బాదంపప్పుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే వైద్యులు కూడా బాదంపప్పుని తరచుగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. బాదంపప్పులో ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే కొంతమంది బాదం పప్పుని అలాగే తింటే మరికొంతమంది రాత్రిళ్ళు నానబెట్టుకొని మరి తింటూ ఉంటారు. మరి ఇలా నానబెట్టుకుని ఎందుకు తినాలి అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాల్చిన బాదం చాలా రుచికరంగా ఉంటుంది. బాదంపప్పుని డ్రై రోస్ట్ చేయవచ్చు. ఉప్పుతో వేయాలి. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు తినవచ్చు. అలాగే పచ్చి బాధని తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఈ హెల్దీ ఫ్యాట్స్ మెగ్నీషియం కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఈ బాదంపప్పులు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకి 5 నుంచి 10 బాదంపప్పులు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరు రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే తింటూ ఉంటారు. ఇలా నైట్ అంతా నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాము.

అయితే, చర్మంలోని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ పోషకాల శోషణకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత పొట్టుని తొలగించి తినవచ్చు. అంతేకాదు, నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్, ఇది పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది. నానబెట్టిన బాదంని నమిలి తినడం మంచిది. ఇది పిల్లలకి చాలా మంచిది