Diabetes – Sleep : నిద్రకు, షుగర్‌కు సంబంధం ఉందా ?

Diabetes - Sleep : ఆహారం ఎలా అవసరమో.. నిద్ర కూడా అంతే అత్యవసరం.

  • Written By:
  • Updated On - November 5, 2023 / 07:24 AM IST

Diabetes – Sleep : ఆహారం ఎలా అవసరమో.. నిద్ర కూడా అంతే అత్యవసరం. నిద్రలేమి వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడి షుగర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. మన ఆరోగ్యం బెటర్ కావడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో.. తగినంత నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. నిద్రలేమి వల్ల మీ బాడీపై ఒత్తిడి పెరిగి కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే షుగర్ ఉన్నవాళ్లు రోజూ కనీసం 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి.  టైప్ 2 డయాబెటిస్ ఉన్న ప్రతి 10 మంది రోగులలో 7 మంది అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మెడ భాగంలో కొవ్వు అధికంగా పెరగడం వల్ల అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య వస్తుంది.  దీనివల్ల నిద్రలో ఉండగా.. అకస్మాత్తుగా  శ్వాస ఆడక ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. శరీరానికి తగిన ఆక్సిజన్ సరఫరా అందక.. అకస్మాత్తుగా నిద్ర నుంచి మేల్కొనాల్సిన పరిస్థితి(Diabetes – Sleep)  చుట్టుముడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

నిద్ర కోసం ప్లానింగ్ అత్యవసరం

  • నాణ్యమైన నిద్ర కోసం రోజూ ఒకే టైంలో నిద్రపోండి. కనీసం 8 గంటలు తప్పకుండా నిద్రపోండి.
  • మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోండి. వాటిని కంట్రోల్‌లో ఉంచుకుంటే.. మీకు తగినంత నిద్రపడుతుంది.
  • షుగర్ ఉన్నవారిలో కొందరికి ఎక్కువగా నిద్ర వస్తుంటుంది. కొందరిని నిద్రలేమి వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం కష్టమైనా రాత్రిపూటే ఎక్కువగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
  • మద్యం తీసుకుంటే నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్రలోనూ మీ మనస్సు గందరగోళానికి గురవుతూ ఉంటుంది. మద్యం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
  • వ్యాయామం చేసేవారికి రాత్రిటైంలో మంచి నిద్ర వస్తుంది. వ్యాయామం చేస్తే మీ బాడీ వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

Also Read:Man’s Body In Suitcase: సరస్సును శుభ్రం చేస్తున్నప్పుడు సూట్‌కేస్‌లో మృతదేహం.. అమెరికాలో ఘటన

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.