భారతదేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు తినే ఆహార పదార్థాలలో అన్నం కూడా ఒకటి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తో పాటు చుట్టుపక్క ఉండే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ శాతం మంది ఈ అన్నం తింటూ ఉంటారు. రోజులో ఎలాంటి పదార్థాలు తిన్న ఒక్కసారి అయినా అన్నం తినాల్సిందే. ఒక్క పూట అన్నం తినకపోయినా కూడా కనీసం భోజనం చేసినట్టు అనిపించదు. చపాతి, రొట్టెలు, ఉప్మా, ముద్ద వంటివి ఎన్ని తిన్నా సరే అన్నం తినకుండా ఉండలేరు. కొంతమంది అన్నం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని వాటికి బదులుగా చపాతీ ముద్ద వంటివి కూడా తింటూ ఉంటారు. కానీ అన్నం తిన్నా కూడా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి అన్నం తింటూ బరువు ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నాన్ని లంచ్‌లో తినడం చాలా మంచిది. ఎందుకంటె అన్నంలో బి విటమిన్స్ ఉండడం కారణం అంటున్నారు. బ్లాక్ రైస్ వంటివి బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగ్గా చేస్తుందట. నిజానికీ ఈ బ్లాక్ రైస్ తో చేసిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయట. దీంతో ఇవి బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందని, దీంతో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. చాలా మంది తెల్లని బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇందులో పోషకాలు, ఫైబర్ లు బ్రౌన్ రైస్, గ్రే రైస్ లతో పోలిస్తే తక్కువ. మనం తెల్లని రైస్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందట.
దీంతో షుగర్ కూడా పెరుగుతుందట. అయితే దీని బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే అందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయట. వాటిని తినడం మంచిదని చెబుతున్నారు. మనం ఏ రైస్ ఎంత మంచిదైనప్పటికీ మనం తినే రైస్ మోతాదులోనే తినాలని గుర్తుంచుకోవాలట. మనం ఎక్కువగా తెల్లని రైస్ తసీుకుంటాం. ఇందులో కాస్తా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. పైగా విటమిన్స్, ఫైబర్, మినరల్స్ కావాలనుకుంటే కచ్చితంగా బ్రౌన్‌రైస్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలని చెబుతున్నారు. అది కూడా మధ్యాహ్నం వేళలో తింటే చాలా మంచిదట. అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం అంత మంచిది కాదట. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని ఈజీగా పెంచుతాయట. అలాగే ఎనర్జీని తగ్గిస్తాయట.
బియ్యంలోని కొన్ని గుణాల కారణంగా సరిగా తీసుకోకపోతే మన బాడీలో ఫ్యాట్ పెరిగి బరువు పెరుగవచ్చని చెబుతున్నారు. రాత్రుళ్లు అన్నం తింటే త్వరగానే జీర్ణమవుతుంది. కానీ నిద్ర సమయంలో మీ బాడీకి పోషకాలు అందవు. పైగా రాత్రంతా ఆకలితో ఉండడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే ఆకలిగా అనిపిస్తుంది. చాలా మందికి రాత్రుళ్లు అన్నం తింటేనే త్వరగా జీర్ణమవుతుందనిపిస్తుంది. కానీ అన్నం బదులు ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుందటీ. కొద్దిగా తినగానే కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి, రైస్ బదులు చపాతీ, రోటీ తినడం మంచిది. మీకు రోటీ, అన్నం కూడా నైట్ టైమ్ వద్దనిపిస్తే సలాడ్, సూప్స్ బెస్ట్ ఆప్షన్. అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.