Site icon HashtagU Telugu

Singh KK And Myocardial Infarction: మయోకార్డియల్ అంటే ఏమిటి?..లక్షణాలు ఎలా ఉంటాయి..?

Singer KK

Singer KK

మయోకార్డియల్ ఇన్ఫార్ క్షన్ అంటే హార్ట్ ఎటాక్ అని అర్ధం. గుండె కండరాలకు తగినంతగా ప్రాణవాయువు అందని సమయంలో గుండెపోటు వచ్చి…ఆ తర్వాత గుండె అరెస్ట్ అవుతుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)డేటా ప్రకారం…తీవ్రమైన నొప్పి లేదా కరోనరీ ఆర్టరీ సంకోచించడం వల్ల గుండెకు రక్తం సరఫరా ఆగిపోతుంది. అలాంటి సందర్భంలో ఈ పరిస్థితికి కారణం అవుతుంది.

ప్రముఖ హార్ట్ స్పెషలిస్టు, మేదాంత చైర్మన్ డాక్టర్ నరేశ్ ట్రెహాన్ దీని గురించి వివరించారు. ఆర్టరీల్లో ముందు నుంచే బ్లాకేజీలు ఉండే అవకాశం ఉండొచ్చు. అలాగే అధిక రక్తపోటు ఉన్నా కూడా ఆర్టరీ రప్చర్ అవుతుంది. దీంతో తీవ్రమైన హార్ట్ ఎటాక్ వస్తుంది. కోవిడ్ మహమ్మారి కూడా మరొక రిస్క్ ఫ్యాక్టర్ గా మారిందంటూ చెప్పారు.

లక్షణాలు
ఛాతిలో నొప్పి, అసౌకర్యంగా ఉండటం, బలహీనత, తలతిరుగుతున్నట్లు అప్పుడప్పుడు అనిపించడం, తలతిరిగి పోతున్నట్లు అనిపించడం, దవడ, మెడ, వీపు భాగంలో నొప్పి, శ్వాస చాలడం లేదని అనిపించడం, ఇవన్నీ గుండె సమస్యకు లక్షణాలుగా భావించి వైద్య పరీక్షలకు చేయించుకోవాలి.

రిస్క్ తగ్గించుకోవడం
ఆరోగ్యకరమైన జీవనశైలిలో హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. పొగతాగడం మానుకోవాలి. వయస్సు అనేది మన చేతుల్లో ఉండేది కాదు. రిస్క్ ను తగ్గించుకునే చర్యల వరకే మన చేతుల్లో ఉంటుందని అమెరికా సీడీసీ సూచిస్తోంది.

ఛాతీపై బలంగా అదుముతూ గుండె కండరాల్లో తిరిగి స్పందన వచ్చేందుకు చేసే సీపీఆర్ గురించి ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన యూట్యూబ్ లో వీడియోలు చాలా ఉన్నాయి. అంతేకాదు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ చేసిన వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. గాయకుడు కేకేకు సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలు ఎక్కవగా ఉండేదని వైద్యుల అభిప్రాయం.

Exit mobile version