Site icon HashtagU Telugu

Hypo Tension : లేచి నిలబడగానే తల తిరుగుతుందా…?అయితే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కావొచ్చు…!!

Blood Pressure

Blood Pressure

కొందరికి  లేచి నిలబడగానే అకస్మాత్తుగా తల తిరుగుతుంది. ఇలా చాలామందికి జరిగినట్లు అనుభవంలోకి వచ్చింది. దీన్ని ఆర్ధోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు. ఆర్థోస్టాటిక హైపోటెన్షన్ అనేది శరీరం భంగిమలో మార్పు కారణం తోపాటు రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలే కారణమని వైద్యులు వివరిస్తారు. అందుకే మీరు కుర్చీ లేదా మంచి నుంచి లేచినప్పుడు అసాధారణమైన మైకం వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

పడుకున్నప్పుడు లేదా కూర్చునప్పుడు గురుత్వాకర్షణ శక్తి కారణంతో రక్తం సాధారణంగా కాళ్లకు ప్రవస్తుంటుంది. మనం లేచిన నిలబడిన వెంటనే మెదడుకు ఆక్సిజన్ ను  సరఫరా చేయడంతోపాటు రక్తాన్ని పైకి నెట్టేందుకు మన శరీరం పనిచేస్తుంది. అప్పుడు అది సరిగ్గా పనిచేస్తుంది. తద్వారా మీ కాళ్ల పెద్ద సిరల నుంచి రక్తాన్ని బయటకు తీసి మీ మెదడుకు అలాగే గుండెకు సరఫరా చేయడానికి శరీరం సమయం తీసుకుంటుంది.
ధమనులలో రక్తపోటు నిర్ధిష్ట స్థాయిల కంటే తక్కువగా ఉంటే హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటు, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ను అనుభవించే వ్యక్తులు సాధారణంగా నిల్చున్న కొద్ది నిమిషాల్లోనే రక్తపోటు గణనీయంగా తగ్గిపోతుంది. ఈ సమస్య ఎక్కువగా 65లేదా అంతకంటే ఎక్కువగా వయస్సున్న వారిలో సాధారణంగా గమనించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్దయ్యాక, రక్తపోటు తగ్గడానికి శరీరం ప్రతిస్పందించే సామర్థ్యం క్రమంగా మందగిస్తుంది.

అయితే నిపుణుల ప్రకారం…ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కూడా రక్తనాళాల్లో ద్రవం కోల్పోవడం వల్ల ఇది సంభవించవచ్చు. మందులు వాడటం, వాంతులు, విరేచనాలు నిర్జలీకరణం కూడా తలతిరగడం వంటి అనుభూతిని కలిగించవచ్చు. దీంతో రక్తహీనత వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ కు కూడా కారణం అవుతుంది. ఈ స్థితిలో రక్తప్రవాహంలో తక్కువ సంఖ్యలో బ్లడ్ సెల్స్ అందుబాటులో ఉంటాయి. దీంతో కొందరికి కళ్లు తిరుగుతాయి…మరికొందరికి మూర్చవచ్చే అవకాశం ఉంటుంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పుష్కలంగా ద్రవాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అతిసారం లేదా వాంతుల కారణంగా ద్రవం కోల్పోయినట్లయితే…వెంటనే భర్తీ చేయాలి. అంతేకాదు ఆల్కహాల్ కు కూడా దూరంగా ఉండాలి. భోజనంలో ఎక్కువగా ఉప్పును ఉపయోగించకుండా జాగ్రత్తలు  తీసుకోవాలి.

Exit mobile version