సర్వేకల్ క్యాన్సర్ (Cervical Cancer) అంటే ఏంటి..? దీనిని ఎలా గుర్తించాలి (Cervical Cancer Symptoms)..? ఇప్పుడు పూనమ్ పాండే (Poonam pandey) మృతి తర్వాత అంత మాట్లాడుకుంటుంది ఇదే. బాలీవుడ్ హాట్ బ్యూటీగా అతి కొద్దీ రోజుల్లోనే యూత్ ను ఆకట్టుకున్న పూనమ్..కేవలం 32 ఏళ్లకే మరణించింది. అది కూడా సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోవడం తో సర్వేకల్ క్యాన్సర్ గురించి అంత ఆరా తీయడం స్టార్ట్ చేసారు.
సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి సంబంధించిన వివిధ జాతులు సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. HPV కి గురైనప్పుడు, శరీర ఇమ్యూనిటీ కారణంగా సాధారణంగా వైరస్ హాని చేయకుండా అడ్డుకుంటుంది. కొందరిలో వైరస్ సంవత్సరాలు జీవించి ఉంటుంది. కొన్ని సర్వైకల్ కణాలు.. క్యాన్సర్ కణాలుగా మారతాయి. స్క్రీనింగ్ టెస్ట్, HPV ఇన్ఫెక్షన్ నుండి రక్షించే వ్యాక్సిన్‌ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ కాన్సర్ బారినపడితే ముందుగా సెక్స్ సమయంలో నొప్పి, ఆ తర్వాత రక్తస్రావం, కటి భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని రేడియేషన్ ఆంకాలజిస్టులు అంటున్నారు. కొందరిలో వైట్ డిశ్చార్జ్, అధిక రక్తస్రావం, సమయానికి ముందుగానే పీరియడ్స్ రావడం, నడుం నొప్పి, కిడ్నీల వైఫల్యం, బరువు తగ్గడం, రక్తహీనత వంటివి కనిపిస్తాయని చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సర్వేకల్ క్యాన్సర్ రకాలు (Types of Cervical Cancer) చూస్తే..
* పొలుసుల కణ క్యాన్సర్..
* అడెనోకార్సినోమా. .
పొలుసుల కణ క్యాన్సర్ (Squamous Cell Carcinoma) :-
ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ క్యాన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్.
అడెనోకార్సినోమా (Adenocarcinoma) :-
ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది.
ఈ కాన్సర్ (Cervical Cancer ) కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సాధారణ పాప్ టెస్ట్‌లను చేసుకోవడం మంచిది. పాప్ టెస్ట్‌లు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయి. కాబట్టి గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవి తప్పనిసరి. వైద్య సంస్థలు 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాని సూచిస్తున్నాయి. సురక్షితమైన శృంగారం, లైంగిక సంక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకుంటే మీ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
ఇక స్మోక్ అనేది చేయొద్దు. పొగ త్రాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే దానికి దూరంగా ఉండడం మంచిది. అదే విధంగా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ సలహాతో సరైన లైఫ్‌స్టైల్ పాటించడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మరిచిపోవద్దు.
Read Also : TS : ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి’ – రేవంత్