అల‌స‌ట‌గా ఉంటున్నారా? అయితే ఈ విట‌మిన్ లోపం ఉన్న‌ట్లే?!

మీ ఆహారంలో పాలకూర, తోటకూర, మెంతికూర, క్యాబేజీ వంటి ఆకుకూరల పరిమాణాన్ని పెంచండి. వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Vitamin K

Vitamin K

Vitamin K: చాలామంది తరచుగా విటమిన్ డి, విటమిన్ ఇ లేదా విటమిన్ సి గురించి మాట్లాడుతుంటారు. కానీ మన శరీరానికి విటమిన్ కె ఎంత అవసరమో మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ కె కేవలం రక్తం గడ్డకట్టడానికే కాకుండా ఎముకలు, గుండె, చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ శరీరంలో దీని లోపం ఏర్పడితే దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంది. చాలా మందిలో ఎముకలు బలహీనపడతాయి. ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా మీలో విటమిన్ కె లోపం ఉన్నట్లే. ఈ లోపాన్ని అధిగమించడానికి రోజువారీ ఆహారంలో విటమిన్ కె పుష్కలంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి.

విటమిన్ కె అంటే ఏమిటి?

విటమిన్ కె అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ప్రధానంగా రెండు రకాలు. మొదటిది విటమిన్ కె1 (K1), రెండవది విటమిన్ కె2 (K2). ఇది ఎక్కువగా పులియబెట్టిన ఆహారాలు, జంతు సంబంధిత ఉత్పత్తులు, ఆకుకూరలలో లభిస్తుంది.

Also Read: అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?

విటమిన్ కె లోపం వల్ల కలిగే లక్షణాలు

  • తరచుగా ముక్కు లేదా చిగుళ్ళ నుండి రక్తం రావడం.
  • చిన్న దెబ్బ తగిలినా రక్తస్రావం ఎక్కువగా అవ్వడం.
  • ఎముకలలో నొప్పి లేదా బలహీనత.
  • అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం.

విటమిన్ కె ఏ పదార్థాలలో లభిస్తుంది?

ఆకుకూరలు: మీ ఆహారంలో పాలకూర, తోటకూర, మెంతికూర, క్యాబేజీ వంటి ఆకుకూరల పరిమాణాన్ని పెంచండి. వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.

బ్రోకలీ- క్యాలీఫ్లవర్: ఈ రెండు కూరగాయలలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి జీర్ణక్రియకే కాకుండా విటమిన్ కె పొందడానికి కూడా మంచి మార్గాలు.

సోయాబీన్: సోయాబీన్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. టోఫు, సోయా పాల ద్వారా విటమిన్ కె2 సులభంగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పెరుగు- పనీర్: మీ డైట్‌లో పెరుగు, పనీర్ చేర్చుకోండి. వీటిలో విటమిన్ కె2 సమృద్ధిగా ఉంటుంది. పులియబెట్టిన డైరీ ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా మంచివి.

కోడిగుడ్డు సొన: గుడ్డులోని పసుపు భాగం (సొన) విటమిన్ కె కు మంచి మూలం. అయితే దీనిని మితంగానే తీసుకోవాలి. అతిగా తింటే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

విటమిన్ కె వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

  • రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.
  • ఎముకలను దృఢంగా మారుస్తుంది.
  • గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  • గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది.
  • మహిళలకు (ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో) ప్రయోజనకరంగా ఉంటుంది.
  • ఎముకల బలహీనతను దూరం చేస్తుంది.
  • ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారడం) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  Last Updated: 25 Jan 2026, 05:28 PM IST