Site icon HashtagU Telugu

Lemon Water: లెమన్ వాటర్ మంచివే కదా అని తెగ తాగేస్తున్నారా.. జాగ్రత్త ఈ సమస్యలు రావడం ఖాయం!

Lemon Water

Lemon Water

నిమ్మకాయ నీరు.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిమ్మకాయ నీరు తరుచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అయితే నిమ్మకాయ నీరు మంచిదే కదా అని వేసవికాలంలో చాలామంది తెగ తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. మరి లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన శరీరానికి విటమిన్ సి చాలా అవసరం అయినప్పటికీ, చాలా ఎక్కువ తీసుకుంటే రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుందట. అలాగే ముఖ్యమైన అవయవాలను కూడా ప్రభావితం చేస్తుందట. శరీరంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి విటమిన్ సి మితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే అధిక మోతాదులో విటమిన్ సి కడుపులో అధిక యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుందట. ఇది పెంచి అతిసారం వికారం వంటి జీర్ణాంతర సమస్యలకు దారితీస్తుందట.

అలాగే నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉందట. నోటి దుర్వాసనతో పోరాడటానికి, దంతాలను శుభ్రపరచడానికి దీనిని ఉపయోగిస్తున్నప్పటికీ, అధిక వినియోగం నోటి మంటకు దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే పుండ్లు, పొక్కులు, చికాకు కలిగిస్తుందని చెబుతున్నారు. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెడిసిన్స్ తీసుకుంటున్నట్లయితే నిమ్మరసం ఎక్కువగా తీసుకోకూడదని ఎందుకంటే ఈ నిమ్మరసం ఆ మెడిసిన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని చెబుతున్నారు.