ప్రతిరోజు తప్పకుండా కాఫీలు టీలు తాగుతూ ఉంటాం. ఒక రోజు కాఫీ టీ తాగకపోయినా కూడా ఏదో కోల్పోయిన వారు ఇలా ఉంటారు. కాఫీ, టీ లకు అలవాటు పడిన వారికి రోజులో ఒక్కసారైనా కాఫీ తాగాల్సిందే. ఇకపోతే కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా అని శృతి మించి తాగితే మాత్రం సమస్యలు తప్పవు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల నిద్రమబ్బు వదిలిపోయి రోజంతా కూడా ఎనర్జిటిక్ గా,యాక్టీవ్ గా ఉంచేలా చేస్తుంది.
అయితే కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, తాగడం వల్ల అనే నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీని తాగడం మానేస్తే అలసట, తలనొప్పి, చిరాకు, ఏకాగ్రతలో ఇబ్బందులు ఇట్టే దూరమవుతాయట. ఎందుకంటే కాఫీ లోని కెఫిన్ మన శరీరం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందట. కాబట్టి మీరు దీనిని మానేసినప్పుడు ఈ సమస్యలు ఆటోమెటిక్ గా దూరమవుతాయని చెబుతున్నారు. ఇది మీకు కొద్దిసేపటి వరకు ఎనర్జీని అందిస్తుందట. ఇది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుందట. కాఫీ తాగడం మానేసినప్పుడు మీకు బాగా నిద్రపడుతుందని చెబుతున్నారు.
కెఫిన్ మీ శరీరంలో గంటల తరబడి ఉండి మీ సహజ నిద్ర మేల్కొలుపు చక్రానికి అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నారు. కాఫీని మానేయడం వల్ల దీర్ఘకాలికంగా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. కాఫీ అలవాటు వల్ల దీనిని మానేసిన మొదట్లో మందకొడిగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మీ శరీరం అలవాటు పడి రోజంతా మీ ఎనర్జీ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుందట. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయట. మీరు కాఫీని తగ్గిస్తే మీ జీర్ణక్రియ, మొత్తం గట్ ఆరోగ్యం మెరుగుపడుతుందట. నిజానికి కొంతమంది కాఫీ తాగడం ఆపేసిన తర్వాత వారి కడుపు సమస్యలు పూర్తిగా తగ్గుతాయట.