ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అర్థరాత్రి దాటినా కూడా మొబైల్ ఫోన్ల లోనే మునిగిపోతూ ఉంటారు. దీని ద్వారా కంటికి సంబంధించిన సమస్యలతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ ని విచ్చలవిడిగా వాడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే మొదట చేసే పని మొబైల్ ఫోన్ ని చూడడం.
ఆ తర్వాత వారి కార్యక్రమాలను పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయట. ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ కంటి ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే రెటీనాను దెబ్బతీస్తుంది. దీనికి తోడు వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ సమస్య వచ్చేలా కూడా చేస్తుందట. ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూస్తే కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. కళ్లపై ఒత్తిడి పెరిగితే.. కళ్లలో వాపు, నొప్పి, కళ్ల అలసట, పొడిబారడం వల్ల దురద వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.
మీరు నిద్రపోయే ముందు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ను ఉపయోగిస్తే.. మీ జీవ గడియారం మారుతుందట. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టడం వల్ల మీకు ఒత్తిడి, యాంగ్జైటీ కలుగుతుందని, నిజానికి మెసేజెస్, ఈ-మెయిల్స్, నోటిఫికేషన్ రకాలు ఒకేసారి మీ యాంగ్జైటీకి కారణమవుతాయని చెబుతున్నారు. మానసిక ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే రోజంతా మీరు ఒత్తిడికి లోనవుతారు. ఒక వైపు మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్ మీ రెటీనాను దెబ్బతీస్తే మరోవైపు ఆందోళన కూడా మీ సమస్యను పెంచుతుందని కాబట్టి ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూసి అలవాటును మానుకోవాలని చెబుతున్నారు.