నిద్ర అన్నది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని అంటుంటారు. అయితే కొందరు పడుకోగానే నిద్ర వస్తే ఇంకొందరు నిద్ర పోవడానికి చిన్న పాటి యుద్ధమే చేస్తుంటారు. అయితే నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా నిద్ర ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెబుతున్నారు. మరి ఎక్కువ సేపు నిద్రపోతే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఎక్కువ సేపు నిద్రపోయే మహిళలు తల్లులు కావడం కష్టమవుతుందట. ఎక్కువసేపు నిద్రపోయే మహిళలు గర్భం ధరించే అవకాశం తక్కువగా ఉంటుందట. అలాగే నిద్ర సమయంలో వ్యత్యాసం మన శరీరంలోని హార్మోన్ గ్రంథుల పనితీరును ప్రభావితం చేస్తుందట. అలాగే ఇది ఇర్రెగ్యులర్ రుతుచక్రానికి కారణమవుతుందట. దీనివల్ల పీరియడ్స్ సమయలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాగా
రాత్రిపూట ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతంగా ఉంటుంది. అతిగా నిద్రపోవడం వల్ల కూడా బరువు విపరీతంగా పెరిగిపోతారు. స్థూలకాయానికి, బరువు పెరగడానికి నిద్ర సమయం కూడా ఒక ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిద్ర ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ సేపు నిద్రపోవడం అసలు మంచిది కాదు. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా పలు రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
note : మీ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.